పంజాబ్ కు వరుసగా ఐదో ఓటమి.. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం

Publish Date:May 14, 2026

Advertisement

ధర్మశాల వేదికగా పంజాబ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ఐపీఎల్ లో  పంజాబ్ కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఐపీలఓ 2026 టోర్నీని ఘనంగా వరుస విజయాలతో ప్రారంభించిన పంజాబ్ ఆ తరువాత వరుసగా పరాజయాలను ఎదుర్కొంది. ఇక తాజాగా గురువారం (మే 14)న ముంబైతో జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరు అవకాశాలు సంక్షిష్టంగా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. 

టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో  200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.  

 అంతకు ముందు పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్  32 బంతుల్లో 57  పరుగులు చేసి రాణించాడు. ఆ తరువాత చివరిలో అజ్మతుల్లా ఒమర్జాయ్  17 బంతుల్లో 38 పరుగులు చేయడంతో  స్కోరును 200కు చేరింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ ను కట్టడి చేశాడు. ఇక 201 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనెర్ రియాన్ రికిల్టన్ కేవలం 23 బంతుల్లో  48 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు.  

అయితే రికిల్టన్ ఔటయిన తరువాత  స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి ముంబై ఒత్తిడిలో పడింది. కానీ తిలక్ వర్మ  తన అద్భుత బ్యాటింగ్ తో  మ్యాచ్ ను ముంబై వైపు తిప్పేశాడు. కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి విల్ జాక్స్ పదమూడు బంతుల్లో 25 నాటౌట్ సహకారం అందించాడు.  టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కు చేరాలంటే చెమటోడ్చాల్సిందే. 

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.