ఇరాన్ దూకుడును ఖండించిన ఈయూ, జపాన్

Publish Date:Mar 28, 2026

Advertisement

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంపై యూరోపియన్ దేశాలు, జపాన్ సంయుక్తంగా చర్యలకు దిగాయి. అంతర్జాతీయ నౌకాయాన భద్రత కోసం ఈ దేశాలు చేతులు కలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత కారణంగా హర్మూజ్ జలసంధి గుండా  వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో  బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌ సహా జపాన్   ఉమ్మడి వేదికపైకి వచ్చి సముద్రమార్గాల్లో   స్వేచ్ఛాయుత రవాణా పునరుద్ధరణకు నడుంబిగించాయి.  

ఇరాన్ అనుసరిస్తున్న దూకుడు చర్యలను ఈ దేశాలు సంయుక్తంగా ఖండించాయి.  అమెరికా, ఇజ్రాయెల్  దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న ఆ దేశాలు..  సముద్ర గర్భంలో మైన్లు అమర్చడం,  డ్రోన్లు,  క్షిపణులతో వాణిజ్య నౌకలు లక్ష్యంగా దాడులకు పాల్పడడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు  బ్రిటన్ ప్రధాని కార్యాలయం ద్వారా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ చర్యలు ప్రపంచ శాంతికి, ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించాయి. 

గత 20 రోజులుగా హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ 20 రోజులలో  కనీసం 23 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇరాన్ దాడులకు పాల్పడిన వాణిజ్య నౌకలలో 10 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఈ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడటంతో ఈ దేశాలు స్పందించాయి.  ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని సంయుక్తంగా ప్రకటించాయి.

అదలా ఉంటే.. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు,  నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో   సభ్య దేశాల సాయాన్నికోరగా అందుకు నాటో దేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా సైనిక చర్యకు దిగడానికి ఐరోపా దేశాలు నిరాకరించాయి.  దాడుల కంటే దౌత్యపరమైన చర్చలు, పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఉత్తమమని స్పష్టం చేశాయి.   

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.