ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం.. 16 వేల ఈ-సైకిళ్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశం

Publish Date:May 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి సమస్యకూ తనదైన శైలిలో పరిష్కారాలు కనుగొంటారు. సంక్షోభంలో కూడా అవకాశాలు సృష్టించుకోవాలని పదే పదే చెప్పే ఆయన ప్రస్తుత ఇంధన సంక్షోభ పరిస్థితిని కూడా రాష్ట్రంలో ఈవీల(ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని పెంచేందుకు అందివచ్చిన అవకాశంగా అభివర్ణిస్తున్నారు. 

ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న ఇంధన ఖర్చులను నియంత్రించడం, పర్యావరణాన్ని కాపాడటం ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టి  అమలు చేస్తోంది. ఈ క్రమంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన పొదుపు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమస్థాయిలో ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో..  ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ,  స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి   16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను అందజేయాలని లక్ష్య నిర్దేశం చేశారు. 

ఈవీ వాహనాల వినియోగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను సులభతరంగా కొనుగోలు చేసేలా రుణాలు అందించడానికి ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్  (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో  బ్యాంకుల సమన్వయంతో   ఈఎంఐ పద్ధతిలో వాహనాలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం వాహనాల పంపిణీకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని సీఎం చెప్పారు. ఈ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు.

పర్యావరణహితమైన ఈవీ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుందని చంద్రబాబుసర్కార్ భావిస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో ఒక సానుకూల మార్పు రావడంతో పాటు, సామాన్య ప్రజల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. . త్వరలోనే ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో  పట్టాలెక్కించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు. 

By
en-us Political News

  
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.