ప్రతీకారదాడులు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

Publish Date:May 27, 2026

Advertisement

పశ్చిమాసియాలో  మళ్లీ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి.  అమెరికా, ఇరాన్   మధ్య  టెన్షన్లు పీక్స్ కు చేరుకున్నాయి.   తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ఫజల్ షేకర్చి అమెరికాకు గట్టి హెచ్చరిక  జారీ చేశారు. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే..  తాము చేసే ప్రతీకారం   చాలా తీవ్రంగా,  బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి  యుద్ధం  మొదలైతే..  ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.

గత కొన్ని వారాలుగా అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా   ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌కు చెందిన లారక్ ద్వీపానికి దక్షిణంగా అమెరికా ,  ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు జరిపాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు,    నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్  ప్రకటించింది.

ఈ దాడులలో పలువురు ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యను అమెరికా  ఆత్మరక్షణ దాడులు గా అభివర్ణించగా.. ఇరాన్ మాత్రం దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంది. అమెరికా వైఖరి వల్ల శాంతి చర్చలకు తీవ్ర విఘాతం కలిగిందని ఇరాన్ ఆరోపించింది. 

By
en-us Political News

  
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.