పబ్‌పై ఈగల్ ఫోర్స్ దాడులు.. ఎనిమిది మంది అరెస్టు.. డ్రగ్ టెస్టులో నటి హేమకు నెగిటివ్
Publish Date:Apr 3, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటూ పబ్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌లపై ఈగల్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కోండాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ నైట్‌లైఫ్ కేంద్రం క్వాక్ అరేనా పబ్లో జరిగిన భారీ ఈవెంట్ సందర్భంగా ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది. ఈ పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం (ఏప్రిల్ 2) రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో వారిని అదుపు లోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రగ్స్ సరఫరా కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో భాగంగా పార్టీలో పాల్గొన్న పలువురికి లైవ్ డ్రగ్ టెస్టులు నిర్వహించడం విశేషం. కాగా ఈ సందర్భంగా ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమకు కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఇందుకు సంబంధించి నటి హేమ ఒక వీడియో విడుదల చేశారు. పార్టీకి హాజరైన విషయాన్ని నటి హేమ స్వయంగా సామాజిక మాధ్యమంలో వెల్లడించి.. అధికారులు తన నుంచి యూరిన్ శాంపిల్ సేకరించి నిర్వహించిన పరీక్షలో తనకు డ్రగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినట్లు స్పష్టం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లోనే హేమ డ్రగ్ టెస్ట్ నిర్వహించిన కిట్‌తో వీడియో చేసి విడుదల చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని, నిజాయితీగా ఉండే వ్యక్తినని ఆమె పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/eagle-force-raids-pub-36-216606.html





