యుద్ధ విరమణకు రంగంలోకి అంతర్జాతీయ మధ్యవర్తులు

Publish Date:Apr 6, 2026

Advertisement

 

యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.  మంగళవారం (7-4-26) రాత్రి వరకు ఉన్న గడువు దగ్గర పడుతున్నా ఇరాన్ రియాక్ట్ అవ్వడం లేదు. దాంతో ట్రంప్ పరుషపదజాలంతో ఇరాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలో గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ యాక్సియాస్  నివేదించింది.

ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ఆపి, చర్చలకు మార్గం సుగమం చేయడం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాలు ఎటువంటి దాడులకు పాల్పడకుండా 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. ఈ సమయంలో వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. ఈ చర్చల్లో ఖతార్, ఒమన్ వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇవి అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు లోపు ఇరాన్ ఒక నిర్ణయానికి రావాలని ఆయన హెచ్చరించారు. ఈ లోపే మధ్యవర్తులు ఈ 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు.

By
en-us Political News

  
రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.
ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.