వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా.!

Publish Date:Aug 13, 2026

Advertisement

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

వేగంగా తినడం...

మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.

వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు..

వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.  

స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు.

వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.  

వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.

                                                                                                                                                  *రూపశ్రీ.
 

By
en-us Political News

  
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.