సైబర్ నేరగాళ్ల టోకరా...వాట్సాప్ మేసేజ్‌తో రూ.1.20 కోట్లు మాయం

Publish Date:Mar 21, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త పద్ధతి ద్వారా మోసాలకు తెరలేపారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ వ్యాపార వేత్తలను టార్గెట్ చేసుకొని రంగంలోకి దిగారు.... సైబర్ నేరగాళ్లు మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకుని, ఆమె పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి రూ.1.20 కోట్లను దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలు ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సేకరించిన సైబర్ నేరగాళ్లు, వాట్సాప్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు.

ఈ నెల 13న ఆ నకిలీ ఖాతా ద్వారా ఆమె అకౌంటెంట్‌కు సందేశం పంపారు. “మీటింగ్‌లో ఉన్నాను… అత్యవసరంగా చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలి” అంటూ ఆదేశాలు జారీ చేశారు. సందేశంలో ఆమె పేరు, ఫోటో ఉండటంతో నిజమేనని నమ్మిన అకౌంటెంట్, ఎటువంటి అనుమానం లేకుండా, కనీసం ఆ మహిళా వ్యాపారవేత్తను అడగకుండా ఒకే లావాదేవీలో 1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం ఆ విషయాన్ని అకౌంటెంట్ వాళ్ళ మేడంకి చెప్పలేదు.

అయితే ఇదే తరహాలో ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలని సందేశం రావడంతో, ఈసారి అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. చెక్ అప్రూవల్ కోసం నేరుగా మహిళ వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన డబ్బు విషయాన్ని తెలియజేయడంతో, ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. తాను ఎలాంటి సందేశాలు పంపించలేదని డబ్బులు అడగలేదని ఆమె స్పష్టం వ్యక్తం చేసింది. దీంతో  అసలు మోసం బయట పడింది. ఇది సైబర్ నేర గాళ్లు పని అయిఉంటుందని గ్రహించిన బాధితురాలు తక్షణమే  1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు సమా చారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కేరళకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఇలాంటి మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేసే ముందు, ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకోవాలని సూచిస్తున్నారు. అపరిచిత ఖాతాలకు డబ్బులు పంపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు. రోజురోజుకి టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరగాళ్ల కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, ఒక్క నిర్లక్ష్యం  భారీ నష్టాలకు దారి తీస్తుం దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.