ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండంటే రెండు రోజుల వ్యవధిలో అకాలవర్షాలకు తొమ్మండుగురు మృత్యువాత పడ్డారు. అకాల వర్షాలతో పాటు పిడుగుల వర్షం కూడా పడుతోంది. దీంతో రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
దర్శి మండలం చామంతపూడిలో ఆవుల మల్లికార్జున్ (22), ముండ్లమూరు మండలం పసుపుగల్లులో రావులపల్లి శివరామకృష్ణ పిడుగుపాటుకు మరణించారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువులోని ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడి కన్నయ్య అనే యువకుడు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే మండలంలోని యండ్రపల్లిలో నాగయ్య, కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద దుర్గేశ్ అనే మరో వ్యక్తి పిడుగుపాటుకు బలయ్యారు. మరోవైపు, విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్న ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/havoc-caused-by-unseasonal-rains-in-ap-36-216805.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.