Publish Date:Mar 21, 2026
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపించే రాయితీ క్యాంటీన్లు, అవుట్‌లెట్లు, కమ్యూనిటీ కిచెన్‌లకు సరఫరా అయ్యేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు నీరజ్ మిట్టల్ సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shortage-of-commercial-gas-cylinders-36-215926.html
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.