వైసీపీ నేతల్లో నైరాశ్యం.. పక్క చూపులు చూస్తున్న వైనం

Publish Date:Nov 10, 2022

Advertisement

విధ్వంసాలు, కూల్చివేతలు, దశాబ్దాలుగా కొనసాగుతున్న సంస్థలు, వ్యవస్థల పేర్ల మార్పిడి, విగ్రహాల కూల్చివేతలు, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం, అభివృద్ది ఆమడదూరం, ప్రాజెక్టుల నిర్మాణంలో చెప్పలేనంత జాప్యం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించే చేవ లేకపోవడం, ఉన్న పరిశ్రమలు, సంస్థలు భయంతో పారిపోయేలా చేసే విధానాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పేచీలు, రాజధాని లేకుండా చేసిన వైనం, మూడు రాజధానుల జపంతో మూడు ముక్కలాట. రోడ్లు లేని దుస్థితి. కనీసం మరమ్మతులైనా చేయని తీరు. జనం మధ్యకు రాకుండా ముఖం చాటేస్తున్న వైనం.. వచ్చినా.. అడ్డు తెరలు, సామాన్యులు దరి చేరనివ్వకుండా భద్రతా వలయం.. కనీసం ఎమ్మెల్యేలకైనా ముఖ్య నేత అపాయింట్ మెంట్ దొరకని విధానం.. నవరత్నాల పేరుతో నవ విధాల ద్రోహం.. ఎవరినీ లెక్కచేయనితనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. ఘనత వహించిన ఏపీ సీఎం తీరుతో ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ దిగజారిపోతోందనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని 2019 ఎన్నికల ముందు.. ఊరూరా తిరిగి అర్థించిన వైసీపీ అధినేత తీరా అధికార పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు పల్లెల్లో అధికశాతం జైకొట్టాయి. పట్టణ ప్రజల్లోనూ ఎక్కువ మంది ఆయనకే ఓటు వేశారు. యువకుడైన జగన్ ఏపీ అభివృద్ధికి, తమ బాగు కోసం ఏదో చేస్తారనే ఆశతో ఓట్లు వేసి భారీ విజయం కట్టబెట్టారు.

నిజానికి పట్టణ ఓటర్ల మద్దతు ఎప్పుడూ చంద్రబాబుకే ఉండేది. చంద్రబాబు హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పట్టణ యువకుకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా వారు ఎదగారు. బాబు చేసిన అభివృద్ధి ఫలాలు అందరికి పూర్తిగా అందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఏపీగా మారిన తర్వాత తొలిసారి 2014లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దార్శనికతను, కార్యదక్షతను గుర్తించి గెలిపించారు. హైదరాబాద్ కన్నా దీటైన రాజధానిని నిర్మిస్తారని భావించారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి ఆకాశమే హద్దు అవుతుందని ఆశించారు. అయితే.. విభజన గాయాలు, ప్రత్యేక హోదాను చంద్రబాబు సాధించలేకపోయారనే బాధతో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.

ఏపీలోని 25 పార్లమెంటరీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ తీరా ఎన్నికలయ్యాక మాట మార్చడం జనానికి నచ్చలేదు. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపించిన తర్వాత బీజేపీ సర్కార్ కు మన అవసరం లేదు. ప్రత్యేక హోదా సాధించడం కష్టం అని మడమ తిప్పేయడంతో జనంలో వ్యతిరేకత మొదలైంది.

పాలన ప్రారంభించిన తొలినాళ్లలో ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా విధ్వంస పాలనకు తెరలేపడం రాష్ట్ర జనానికి నచ్చలేదు. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ‘రివర్స్ టెండరింగ్’ నెపంతో నిలిపేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామంటూ.. అభివృద్ధిని అస్సలు పట్టించుకోకపోవడంతో వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావనలు మరింత పెరిగాయి.

పథకాల పేరు చెప్పి రాష్ట్ర ఖజానాలోని నిధుల్ని ఇష్టారీతిన ఖర్చుపెట్టేసి, చివరికి ఏపీకి, ఏపీ ప్రజల నెత్తిన మోయలేని అప్పుల భారం పెట్టిన జగన్ తీరుపై జనంలో ఆగ్రహం ఎక్కువైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే.. వారంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానే లేకుండా చేసిన జగన్ ను, ఆయన పాలనను, వైసీపీ సర్కార్ ను జనం దుమ్మెత్తి పోస్తున్నారు. నిరు పేదలకు గత ప్రభుత్వాలు దశాబ్దాల క్రితమే ఇచ్చిన ఉచిత ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పుడు డబ్బులు కట్టాలన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో జనంలో వైసీపీకి బాగా గ్రాఫ్ తగ్గిపోయిందంటున్నారు. మరీ ముఖ్యంగా అక్షర జ్ఞానం ఉన్న పట్టణ ప్రజల్లో వైసీపీ సర్కార్ తప్పిదాలపై వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉందంటున్నారు. అంతే కాదు.. జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు, ఎన్నికల వ్యూహాలు రచించే ఐప్యాక్ బృందం సర్వేల్లోనూ జనం నుంచి వ్యతిరేకతే స్పష్టమైందని తేలింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై జగన్ చీటికి మాటికి ఫైర్ అవుతున్నారనే వార్తలు బయటికి వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి లేదు.. పైగా తామేదో గొప్ప పనులు చేసినట్లు జనాన్ని ఊదరగొట్టాలంటూ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో తమను జగన్ పంపుతుంటే.. ఏం చేయాలో తెలియక ప్రజా ప్రతినిధులు కుమిలిపోతున్నారంటున్నారు. చేయని అభివృద్ధి గురించి ఏమి చెప్పాలి?.. సమస్యలపై స్థానికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నిలువునా వారు జావగారిపోతున్న ఘటనలు ఉన్నాయి.

ఇక.. వైసీపీలో కొత్త ముసలం పుట్టింది. పార్టీ జిల్లాల అధ్యక్ష పదవుల నుంచి సీనియర్లు ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. ముందుగా తానేటి వనిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని వదిలేశారు. తాజాగా కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వచ్చే అవకాశం లేదకుంటున్న కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం జగన్ చెప్పిందే విన్న వారంతా తమ అధినేతపై అసంతృప్తి పెంచుకున్నారంటున్నారు. పార్టీ బాస్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే రాజీనామాలు చేస్తున్న వారిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.