టి20 వరల్డ్ కప్ సెమీస్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
Publish Date:Nov 10, 2022
Advertisement
టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య టి20 సెమీ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టే పాకిస్థాన్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో టాస్ ఇంగ్లాండ్ ను వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కి వేదిక అయిన అడిలైడ్ లో భారత్ కు ఇంగ్లాండ్ తో పోలిస్తే మెరుగైన రికార్డు ఉంది. అలాగే పొట్టి కప్ ప్రపంచ కప్ లో కూడా ఇంగ్లాండ్ కంటే బారత్ దే పై చేయి. ఈ రికార్డులన్నీ భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో భారత్ అభిమానుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుందన్న ధీమా వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈ రోజు ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ జట్టుదే విజయం. ఇరు జట్లూ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/t20-worldcup-england-won-the-toss-and-elected-to-field-25-146915.html





