ప్రేమ పేరుతో మోసం.. పోలీసు అధికారిపై కేసు.!

Publish Date:Oct 11, 2026

Advertisement

భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు..! అలాంటి సమయంలో పరిచయమైన ఓ వ్యక్తి తనకు అండగా నిలుస్తాడని ఆమె భావించింది. తన జీవితంలో మళ్లీ సంతోషం వస్తుందని ఆశపడింది. కానీ, ఆ పరిచయం చివరకు తనను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆమెను మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఓ పోలీసు అధికారి!

భర్త అనారోగ్యం.. జీవితంలో ఊహించని కష్టం.!

నల్గొండలోని సాయినగర్‌కు చెందిన మహిళకు 2008లో సాయి కుమార్‌తో వివాహమైంది. 2014లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో 2015లో ఆమె జీవితాన్ని విషాదం కమ్ముకుంది. మెట్లపై నుంచి జారిపడిన భర్తకు వెన్నెముక విరగడంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమెపై పడ్డాయి. ఈ క్రమంలో 2016 డిసెంబర్‌లో చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అడ్మినిస్ట్రేటివ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం. బాలస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఫోన్ సంభాషణల వరకు వెళ్లింది. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు.

పెళ్లి హామీతో మొదలైన బంధం..!

2017 జనవరిలో బాలస్వామి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సమస్యలు పరిష్కారమైన తర్వాత వివాహం చేసుకుందామని ఇద్దరూ అంగీకరించినట్లు తెలిపింది. అదే ఏడాది మార్చిలో తన భర్త ఇంట్లో లేని సమయంలో బాలస్వామి ఇంటికి వచ్చి, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.అయితే, కొంతకాలానికి బాలస్వామికి అప్పటికే వివాహమైందని ఆమెకు తెలిసింది. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నానని, విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని అతను చెప్పినట్లు బాధితురాలు వెల్లడించింది. అతను వివాహితుడని తెలిసిన తర్వాత దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వీడియో కాల్స్ చేయడంతో భయపడి మళ్లీ మాట్లాడాల్సి వచ్చిందని ఆరోపించింది.

భర్త మరణించినా.. తీరని ఎదురుచూపులు.!

2021 మే 8న ఆమె భర్త మరణించారు. ఆ తర్వాత కూడా బాలస్వామి తనతో సంబంధాన్ని కొనసాగించాడని బాధితురాలు ఆరోపించింది. విడాకులు తీసుకున్నానని చెబుతూ, పెళ్లి చేసుకుంటానని పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ.. వివాహం గురించి ప్రస్తావించిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో తప్పించుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది. 2024లో బాలస్వామి కర్మన్‌ఘాట్‌లో కొత్త ఇల్లు నిర్మించి, తన భార్యాపిల్లలను తిరిగి తనతో పాటు ఉంచుకున్న విషయం బంధువుల ద్వారా తెలిసిందని ఆమె తెలిపింది. దీనిపై నిలదీయగా అసభ్య పదజాలంతో దూషించి, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసినట్లు ఆరోపించింది. కొంతకాలానికి మళ్లీ తనను సంప్రదించి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించాడని ఫిర్యాదులో పేర్కొంది.

మానసిక వేదన.. చివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.!

2025 జనవరి నుంచి బాలస్వామి తనకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా పెళ్లి హామీని నమ్మి ఎదురుచూసిన తనను చివరకు మోసం చేశాడని ఆరోపిస్తూ.. 2026 అక్టోబర్ 9న సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎం. బాలస్వామిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 69, 81, 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకవైపు జీవితంలో ఎదురైన కష్టాలు.. మరోవైపు పెళ్లి హామీతో మోసం చేశారన్న ఆరోపణలు.. చివరకు ఆసుపత్రి చికిత్స, పోలీసుల వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

 

 

 

[ M Balaswamy, Hyderabad Police Officer Arrest, Marriage Fraud Case, Saifabad Police, Khairatabad Detective Inspector, Woman Cheating Case, False Marriage Promise, Sexual Relationship Allegations, BNS Section 69, BNS Section 81, Hyderabad Crime News, Karmanghat Case ]

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.