పవన్ కళ్యాణ్ చొరవతో... కొణిదెల గ్రామానికి మహర్దశ

Publish Date:Feb 21, 2026

Advertisement

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  చొరవతో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  పవన్ కళ్యాణ్  ప్రత్యేక దృష్టితో ఆ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రూ. 50 లక్షల విరాళం అందించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి... గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి వెచ్చించారు. 

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కొణిదెల గ్రామానికి చెందిన  కొందరు  డిప్యూటీ సీఎంని కోరారు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఆ సందర్భంలో ఆయన హామీ ఇచ్చారు. గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షల విరాళం అందజేశారు. 

ఈ నిధులతో గ్రామానికి అవసరం ఉన్న అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను  పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా యంత్రాంగం సూచన మేరకు తానిచ్చిన రూ. 50 లక్షలతో కొణిదెల గ్రామంలో 90,000 లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంక్ కొణిదెల గ్రామం పరిధిలో 2 వేల మంది దాహార్తి తీర్చనుంది. వేసవికి ముందే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

సుమారు రూ. 6 కోట్ల నిధులతో సర్వతోముఖాభివృద్ధి

కొణిదెల గ్రామానికి పల్లెపండగ 1.0లో సుమారు రూ. 20 లక్షలకు పైగా నిధులు వెచ్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మూడు అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. పల్లెపండగ 2.0లో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో ఏడు సీసీ రోడ్లు మంజూరు చేశారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధులతో కొణిదెల గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి కొణిదెల గ్రామం వరకు ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ. 45 లక్షలు మంజూరు చేయించారు. 

వీటితో పాటు ఆ గ్రామ ప్రజల అభ్యర్ధన మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణశాఖ సహకారంతో 19 ఇళ్లు, నీటితొట్టెలు నిర్మించారు. రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్ ను జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేశారు. రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మత్తులు పూర్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులు అడిగిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పనులు చేపడుతున్నారు.


 

By
en-us Political News

  
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
రెండో సారి అమెరికా ప్రెసిడెంట్‌ అయిన డోనాల్డ్ ట్రంప్ .. అగ్రదేశ అధినేతగా ప్రపంచానికి తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు.
జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు.
పాకిస్థాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.