ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగానే..!

Publish Date:Apr 15, 2026

Advertisement

ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను నిప్పుల గుండంగా మారుస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  ఈ నెల   19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత  కిరణాల ప్రభావం భూమిపై నేరుగా పడే అవకాశం ఉన్నందున, చర్మ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా, వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా లేదా నీరసంగా అనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదింలని చెబుతున్నారు. 

ఎండల తీవ్రత నేపథ్యంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లలో గ్యాస్ లైటర్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, బ్యాటరీలు లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంచడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అధిక వేడి వల్ల ఇవి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే వాహనాల్లో ఇంధనాన్ని పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచడం,  టైర్లలో గాలి మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవడం అవసరమని చెబుతున్నారు. 

ఇళ్లలో ఉండేవారు గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలనీ, అలాగే విద్యుత్ పరికరాలపై లోడ్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచిస్తున్నారు. ఇక పోతే గ్యాస్ సిలిండర్లను నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని పానీయాలైన మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా డీహైడ్రుషన్ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయి.

ఇక పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఏసీలను  24-25 డిగ్రీల వద్ద ఉంచుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినదు. రాబోయే రెండు నెలలు  భానుడి ప్రతాపం అధికంగా ఉంటుంది కనుక అందరూ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

By
en-us Political News

  
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93, కూపర్ కానొలీ 46 బంతుల్లో 87 పరుగులు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరి మెరపు బ్యాటింగ్ తో పంజాబ్ ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం దిశగా సాగుతున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు సమాజం నుంచి వచ్చే విమర్శలు.. ఇవన్నీ దాటుకుని తన కలల దిశగా అడుగులు వేయడం సాధారణమైన విషయం కాదు
ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? చర్చ ఒకటి నడుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.