కేజ్రీవాల్ వారి కేడీ మంత్రులు!

Publish Date:Sep 1, 2016

Advertisement

గంగ.... ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి,అక్కడ్నుంచి హిమాలయాల మీదకి, అటు నుంచి భూమ్మీదకి, చివరకు సముద్రంలోకి పతనం అవుతూ వస్తుంది! ఢిల్లీ సీఎం కే్జ్రీవాల్ వారి ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే అలాగే అనిపిస్తోంది! చీపురు కట్టనే పార్టీ గుర్తుగా పెట్టుకుని అవినీతి ఊడ్చేస్తానని ఆయన వచ్చాడు. కాని, ఇప్పుడు జనం చీపుర్లు తిరగేసి కొట్టేలా ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారు!


ఆమ్ ఆద్మీ పేరు చెప్పుకుని, అవినీతి అంతం చేస్తామంటూ, అన్నా హజారేను కూడా తెలివిగా వాడుకున్న కే్జ్రీవాల్ తిరుగులేని మెజార్టీతో సీఎం అయ్యాడు. అయినా కూడా తన సహజ ధోరణి విడిచిపెట్టకుండా మోదీపై విమర్శలతోనే కాలం వెల్లబుచ్చుతున్నాడని ఆరోపణలు వున్నాయి. ఢిల్లీలో రేపుల సంఖ్య ఏదీ తగ్గుముఖం పట్టటం లేదు. అన్నీ సమస్యలు పెరిగిపోతూనే వున్నాయి. కొన్నిటికి లెఫ్టెనెంట్ జనరల్ కారణం అంటాడు. కాదంటే మిగతా వాటికి మోదీ కారణమంటాడు. తాను మాత్రం ఎందుకు బాధ్యుడు కాడంటాడు కేజ్రీవాల్!. పరిపాలన సంబంధమైన విషయాల్లో, రాజకీయ చదరంగంలో కేజ్రీవాల్ ప్రవర్తన ఎలా వున్నా ఆయన అనుచరులు కొందరు చేస్తున్న పనులు మాత్రం ఆప్ ఖాతాలో ఘోరమైన పాపాలుగా చేరిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రజలు తీవ్రమైన గుణపాఠం చెప్పే పరిస్థితులు తీసుకొస్తున్నాయి!


కొన్నాళ్ల కిందట జైన నగ్న సాధువు తరూణ్ సాగర్ హర్యాణ అసెంబ్లీలో స్పీచ్ ఇస్తే నానా రచ్చ చేశారు కొందరు ఆప్ లీడర్లు. ట్విట్టర్ లో అనధికారికంగా నోటికి వచ్చిందంతా వాగేశారు. బట్టలు వేసుకోని ఒక సాధువు గురించే అంత అల్లరి చేసిన వారంతా ఇప్పుడు అవాక్కై వుండిపోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ నేత సందీప్ కెమెరా కంటికి బట్టలు లేకుండా చిక్కాడు. ఇద్దరు మహిళలతో కాంప్రమైజింగ్ పొజీషన్లో చిక్కాడు! పైగా ఈ ఆప్ నేత, కేజ్రీవాల్ కేబినేట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు!. సీడీలో సందీప్ అనే మినిస్టర్ గారి కొన్ని ఫోటోలు కూడా వున్నాయి. అన్నీ చూసి కేజ్రీవాల్ అర్థగంటలోనే సందీప్ ని మంత్రి పదవి నుంచి తొలగిం చేశాడు. ఇది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! కాని, ఆప్ లో ఇలాంటి ముసలం పుట్టడం ఇది మొదటి సారి కాదు. అదే ఆందోళన కలిగిస్తోన్న విషయం... 


తమ పార్టీ అన్నిటికంటే స్వచ్ఛమైన దుకాణం అని చెప్పుకునే కేజ్రీవాల్ ఇంతకు ముందు మరో మంత్రిని ఇలాగే తొలగించాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆప్ పార్టీ ప్రభుత్వంలోనే ఆహార మంత్రిగా పని చేస్తున్నాయాన లంచం తీసుకుంటూ దొరికాడు. ఆయన్ని కూడా సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆర్డర్ ఇచ్చాడు సీఎం. అరవింద్ కేబినేట్ లోని మరో మంత్రి గృహ హింస చట్టం కింద స్వంత భార్య చేతనే కేసు ఎదుర్కొంటున్నాడు. ఇంకొకాయన దొంగ సర్టిఫికెట్ల కేసులో పదవికి రాజీనామా చేశాడు. ఇలా ఎవర్ని కదిలించినా ఘాటైన కేసులు బయటపడుతున్నాయి ఢిల్లీలో. 


త్వరలో రానున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోన్న ఆప్ రోజుకో మంత్రి, నేత నిర్వాకం వల్ల అడ్డంగా బుక్కైపోతోంది. ఒక వైపు అధికారంలో వున్న బీజేపి, మరోవైపు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ లను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతం అవుతోంది. అయినా కూడా కేజ్రీవాల్ ఇమేజ్ తో గట్టెక్కవచ్చని ఆశిస్తోంది! చూడాలి మరి చీపురు పార్టీ భవిష్యత్ ఏంటో? 

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.