ఆసీస్ క్రికెటర్లకు ఆ తిప్పలు ఎందుకంటే?
Publish Date:Feb 18, 2026
Advertisement
ఐసీసీ ఈవెంట్లలో ఒకప్పటి ప్రపంచ నెంబర్ -1 ఆస్ట్రేలియా ప్రదర్శన దారుణంగా పడిపోతూ వస్తోంది. ఎకప్పుడు ఏ టోర్నీలో అయినా టైటిల్ ఫేవరెట్లుగా నిలిచిన కంగారూలు ఇప్పుడు టోర్నీలలో నాకౌట్ దశకు చేరడానికే నానా తిప్పలు పడుతున్నారు. 2024 టీ 20 ప్రపంచకప్‌లో ఆసీస్ సూపర్ -8 దశలో నిష్క్రమించింది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ను దక్షిణాఫ్రిగా ఓడించింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కూడా జింబాబ్వే, శ్రీలంక వంటి జట్ల చేతిలో పరాజయం పాలై లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. అయితే ఆసీస్ జట్టు ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో ఓ వాదన తెగ వైరల్ అవుతోంది. భారత్ క్రికెటర్లు ప్రపంచకప్ గెలిస్తే దేశమంతా పులకించిపోయి పండుగ చేసుకుంది. అసలు భారత్ క్రికెట్ అభిమానులు ఆటగాళ్లను ప్రత్యక్ష దైవాలుగా చూస్తారు. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ గెలిచాక అస్ట్రేలియా ఆటగాళ్లు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రస్తుత టీ 20 జట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఏకంగా ప్రపంచకప్ మీద కాళ్లు పెట్టి ఫొటోకు ఫోజులిచ్చాడు. దాన్ని మీడియా ముందు సమర్ధించుకున్నాడు. ఆ అగౌరవ ప్రభావమే ఐసీసీ టోర్నీల్లో కంగారులు చతికల పడటానికి కారణమంటూ.. నెటిజనులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జింబాబ్వే చేతిలో వారి పరాజయం తర్వాత మొదలైన చర్చ శ్రీలంకతో ఓడిపోయాక మరింత వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా టోర్నీ నుంచి ఆ జట్టు ఔట్ అవ్వడంతో ఆ పోస్టులు రీపోస్ట్ అవుతున్నాయి. ఐర్లాండ్‌తో జింబాబ్వేకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో చెరో పాయింట్ పంచుకుని జింబాబ్లే సూపర్ 8కి వెళ్లడంతో ఆసీస్‌కు డోర్లు మూసుకుపోయాయి.
http://www.teluguone.com/news/content/defeats-continue-for-aussies-cricket-team-36-214271.html





