విజయ్ కోసం డీఎంకేతో కటిఫ్.. కాంగ్రెస్ కు మైనసేనా?

Publish Date:May 9, 2026

Advertisement

తమిళనాడు రాజకీయ యవనికపై సంభవించిన పరిణామాలు, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారనున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీ   సాహసోపేతమైన, ప్రమాదకరమైన అడుగు వేసిందంటున్నారు. దశాబ్దాలుగా విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేతో బంధాన్ని తెంచుకుని..  విజయ్‌కు హస్తం పార్టీ అండగా నిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా..  రానున్న సార్వత్రిక సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. 

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.   అయితే..  ప్రభుత్వ  ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో   దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ..  కాంగ్రెస్   విజయ్‌కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం డీఎంకే అధినాయకత్వానికి మింగుడుపడలేదు. ఫలితంగా కాంగ్రెస్‌తో ఇకపై ఎలాంటి పొత్తు ఉండదని డీఎంకే స్పష్టం చేయడమే కాకుండా.. పార్లమెంటులో కూడా ఆ పార్టీ ఎంపీల పక్కన కూర్చునేందుకు నిరాకరిస్తుండటం రాజకీయ వేడిని పెంచుతోంది.

ఈ పరిణామం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గణనీయంగా తగ్గించేలా కనిపిస్తోంది.  ప్రస్తుతం లోక్‌సభలో డీఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పెద్ద పార్టీ డీఎంకే కావడం గమనార్హం. ఇప్పుడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి నుంచి వైదొలగడంతో..  ఇండియా కూటమి బలం ఒక్కసారిగా 232 నుండి 210కి పడిపోయింది.  కేవలం 100 మంది ఎంపీలు మాత్రమే ఉన్న కాంగ్రెస్..  ఇలాంటి సమయంలో కీలకమైన మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికల పరంగా చూస్తే తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారనుంది. గత ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కారణంగా కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ డీఎంకే సహకారం లేకపోతే..  రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు అన్నది వాస్తవం.  అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించినా, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటర్ల మొగ్గు ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.   

మరోవైపు విజయ్‌కు మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు లోక్‌సభలో నామమాత్రపు బలం మాత్రమే ఉంది. ఈ చిన్న పార్టీల మద్దతుతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పదిలపరుచుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ శక్తిని దూరం చేసుకోవడం వల్ల ఎన్డీఏ కూటమికి  లాభం చేకూర్చడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. డీఎంకేను కాదని విజయ్ కు కాంగ్రెస్ మద్దతు పలకడాన్ని కాంగ్రెస్ పెద్ద తప్పిదమంటున్నారు.   

By
en-us Political News

  
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.