గుజరాత్ గర్జన.. టార్గెట్ నమో.. షా!

Publish Date:Apr 1, 2025

Advertisement

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా  బీజేపీని ఉద్దేశించి  రాసి పెట్టుకోండి  ఈ సారి గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం  అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు   ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో  ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్   అని  సవాల్ విసిరారు. 

అయితే  ఆయన ఆ సవాలు విసిరిన కొద్ది రోజులకే  అదే గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో  ప్రజలు ఇచ్చిన తీర్పు పాత చరిత్రనే తిరగ రాసింది. రాష్ట్రం మొత్తంలో 1912 వార్డులకుకు ఎన్నికలు జరిగితే  బీజేపీ 1402 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 260 వార్డులతో సరిపెట్టుకుంది.  తాలుకా పంచాయత్ ల విషయానికి వస్తే..  55 తాలుకా పంచాయత్ లు బీజేపీ సొంతం చేసుకుంటే, కాంగ్రెస్ కు దక్కింది 17 మాత్రమే. అలాగే  68 నగర పాలికలకు ఎన్నికలు జరిగితే 63 బీజేపీ గెలుచుకుంటే, కాంగ్రెస్ ఖాతాలో చేరింది ఒకే ఒక్కటి. ఈ ఫలితాలను బట్టి చూస్తే గుజారాత్  రాజకీయ ముఖచిత్రంలో  రాహుల్ మార్క్ మార్పునకు స్కోప్ కనిపించడం లేదని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  తర్వాత ఎప్పుడో జరిగే  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను స్థానిక సంస్థల ఫలితాలు ఆధారంగా లెక్కలేస్తున్నారు. అయినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగానే సమయం వుంది. సో ఈ సంవత్సరం పై చిలుకు కాలంలో ఏమైనా జరగ వచ్చు.  గుర్రం ఎగరా వచ్చు.. కాంగ్రెస్ పార్టీ గెలవా వచ్చు అనే ఆశా జీవులు  రాహుల్ గాంధీకీ జై కొడుతున్నారు. 

అయితే  కేవలం స్థానిక సంస్థల ఫలితాల ఆధారంగానే  రేపటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్క కడుతున్నారా అంటే లేదు. కాంగ్రెస్ పార్టీ 1995 నుంచి ఇంతవరకు వరసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయింది. అలాగే  వరసగా 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేక పోయింది.  2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గానూ, కాంగ్రెస్ ఒకే ఒక్క సీటులో గెలిచింది. మిగిలిన పాతిక సీట్లూ బీజేపీ  సొంతం చేసుకుంది. 

నిజానికి  కాంగ్రెస్ పార్టీ వరసగా ఓడిపోతున్న రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి, కానీ, అలాంటి వరస ఓటమి రాష్ట్రాల జాబితాలో గుజరాత్  ముందు వరసలో ఉంటుంది. గుజరాత్ లో ఇంచుమించుగా మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని దక్షాగానే మిగిలి పోయింది. 1995లో మొదలైన వరస ఓటముల పరంపర ఈ రోజుకూ కొనసాగుతూనే వుంది. అంతకు ముందు పదేళ్ళ కాలంలోనూ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం పడుతూ లేస్తూనే సాగింది. ఇక ఆ తర్వాత  2001లో నరేంద్ర మోదీ ఎంట్రీతో  గుజరాత్  రాజకీయ ముఖచిత్రమే మారిపోయంది. మోదీ ఎంట్రీ తర్వాత జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ వరస విజయాలను సొంతం చేసుకుంది. ఓటమి కాంగ్రెస్ ‘చేయి’ వదలలేదు. 

అయితే  రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.  ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి. కొత్తేమీ కాదు. చూస్తున్నదే. సో  వరసగా ఏడు సార్లు ఓడిన హస్తం పార్టీ ఎనిమిదో  సారీ ఖాయంగా ఓడిపోతుందని గానీ ఏడు సార్లు గెలిచిన బీజేపీ ఎనిమిదో సారి కూడా గెలిచి తీరుతుందని గానీ అనుకోలేము. అలా అనుకుంటే అది అయితే రాజకీయ అజ్ఞానం, కాదంటే అహంకారం అవుతుంది. అందుకే రాహుల్ గాంధీ లోక్ సభ  వేదికగా బీజేపీకి విసిరిన సవాల్ ను అంత తేలిగ్గా తీసుకోరాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అదలా ఉంటే  రాహుల్ గాంధీ  వ్యూహం, అంతిమ లక్ష్యం ఏమిటో కానీ  ఆయన వైఖరి చూస్తుంటే  దేశం మొత్తం ఒకెత్తు, గుజరాత్ ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బహుశా కొడితే బీజేపీ (మోదీ – షా జోడీ సొంత గడ్డ) కుంభ స్థలాన్నే కొట్టాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ  గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లున్నారు. అందుకే  ఈ మధ్య కాలంలో ఇంటా,బయట, పార్లమెంట్ లోపల వెలుపల. తరచూ గుజరాత్ ప్రస్తావన తెస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే  రాహుల్  గత జూన్ లోనే  గుజరాత్ లో ల్యాండ్ అయ్యా రు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చాలా గంభీర ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా, ఆయన  లోక్ సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని  ఓడించాం, రేపటి  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తాం అని విశ్వాస ప్రకటన లాంటిది చేశారు. అలాగే  ఇటీవల మరోమారు గుజరాత్  వెళ్లిన రాహుల్ గాంధీ  అక్కడి నుంచే   కాంగ్రెస్ లో కమల దళం కోవర్టులున్నారు అనే సంచలన ప్రకటన చేశారు. అలాంటి ఇంటి దొంగలను ఏరి పారేస్తామని హెచ్చరించారు. అందుకే  రాజకీయ విశ్లేషకులు సర్వ శక్తులు ఒడ్డైనా గుజరాత్ లో  మోదీ – షాల జోడిని  ఓడించి తీరాలనే కసి  రాహుల్ గాంధీలో కనిపిస్తోందని అంటున్నారు. 

అందుకే  ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్’లో ఏఐసీసీ’ సమావేశాలు, నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 64 సంవత్సరాల తర్వాత తొలి సారిగా గుజరాత్’ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ పార్టీ  టార్గెట్ అర్థమవుతోందని అంటున్నారు. మోదీ- షా జోడీని సొంత గడ్డపై ఓడించాలానే లక్ష్యంతోనే ఎఐసీసీ  సమావేశంతో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) విస్తృత స్థాయి సమావేశం కూడా అహ్మదాబాద్ లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందనీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గుజరాత్ నుంచే కాంగ్రెస్ పార్టీ పునర్జీవన ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించారని అంటున్నారు. అందుకే  ఏప్రిల్ 8,9 తేదీలలో  కాంగ్రెస్ సంసారం మొత్తం అహ్మదాబాద్ లో ఉండేలా  ఏఐసీసీతో పాటు, సిడబ్ల్యుసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శనకు, ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దమవుతోందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలో మరో  శక్తి పీఠంగా ఎదిగి వస్తున్న ప్రియాంకా వాద్రాతో పాటుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు,ఇతర సీనియర్ నాయకులు, ఎఐసీసీ ప్రతినిధులు, ఒకరనేమిటి  కాంగ్రెస్ యోధాను యోధులంతా   గుజరాత్  గర్జనకు సిద్ధమవుతున్నారు.  అయితే మిషన్ 27  ప్రధాన ఎజెండా గా జరుగుతున్న ఈ సమావేశాలలో.. నమో షా ..ను టార్గెట్ చేస్తారా? చేస్తే, ఏమవుతుంది? ఇంతా చేసిన తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతం అయితే ... ?

By
en-us Political News

  
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.