రంగుల హోలీకి ‘మత్తు’ రంగు.... ఆరుగురు అరెస్టు

Publish Date:Mar 3, 2026

Advertisement

 

హోలీ అంటే రంగులు, సందడి, మిఠాయిలు… కొంచెం టమాటాలు, కోడిగుడ్లు కూడా ఎగిరిపడితే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ ఈసారి హైదరాబాద్‌ లోని దూల్పేట్–నాంపల్లి ప్రాంతాల్లో మాత్రం రంగుల హోలీకి అదనంగా “మత్తు రంగు” కూడా జతైంది. గంజాయితో తయారుచేసిన బంగ్‌తో హుషారుగా తయ్య తక్కలు ఆడుతుండగా ఎస్‌టిఎఫ్ అంజిరెడ్డి బృందం, దూల్పేట్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి రంగు నీళ్లు చల్లేశారు!పండుగ హుషారులో “భంగ్ భంగ్” అంటూ సంబరాలు చేసు కుంటున్న వారిపై ఒక్కసారి గా దాడులు జరగడంతో రంగుల మధ్య రచ్చ మొదలైంది.

తగ్గేదేలే అనే టైపులో పోలీసులు మొత్తం 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్‌ను  స్వాధీనం చేసుకున్నారు. మూడు చోట్ల దాడులు చేసి మూడు కేసులు నమోదు చేసి ఆరుగురు మందిని అరెస్ట్ చేశారు. హోలీ హడావుడి నేరుగా ఎక్సైజ్ స్టేషన్ వరకూ చేరింది.హోలీ సందర్భంగా బేగం బజార్‌లో 860 గ్రాముల బంగ్ పట్టుకున్నారు చింతమని చందర్ సింగ్, సోహెల్ సింగ్‌ల “రంగుల వ్యాపారం” అక్కడితో ముగిసింది.

ఇకపోతే హౌస్ నెంబర్ 15-7-585 వద్ద 812 గ్రాముల బంగ్ స్వాధీనం చేసుకున్నారు. భరత్ రాజ్, నందన్ యాదవ్, మహేష్‌ల హోలీ ప్లాన్‌కు బ్రేక్ పడింది.అలాగేచూడి బజార్ హౌస్ నెంబర్ 14-8-155లో 950 గ్రాముల గంజాయి బంగ్ బయటపడింది. సాగర్ శర్మ, అజయ్ శర్మల సంబరం పోలీస్ స్టేషన్‌లో ముగిసింది.పండుగ అంటే పూలు, రంగులు… కానీ కొందరికి మాత్రం “మత్తు రంగులే” అసలు హోలీలా మారింది. రంగులతో ఆడుకోవచ్చు, కానీ చట్టంతో కాదు అంటూ పోలీసులు హెచ్చరించారు.

By
en-us Political News

  
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.