సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 10 రకాల థీమ్స్‌తో 5 స్థాయిలలో ఈ యాక్షన్ ప్లాన్ సాగనుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమలు జరపాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక సమావేశాన్ని నిర్ణయించారు.
రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు ముఖ్యమంత్రి తెలిపారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని తెలిపారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావుని తెలిపారు.
కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సీఎం తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలు… ముఖ్యమంత్రి వరకు ఇటు ప్రజా ప్రతినిధుల వ్యవస్థ, అటు కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలి’’ అని సీఎం అన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-214950.html
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
జైశ్వాల్ ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.
అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమో, వ్యూహాత్మక కారణాల రీత్యానో పాకిస్థాన్ సేవలను వినియోగించుకోవచ్చని, అయితే ఇజ్రాయెల్ దృష్టిలో మాత్రం ఆ దేశం ఏ మాత్రం నమ్మదగినది కాదని రూవెన్ అజార్ స్పష్టం చేశారు.
నిందితులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా ఒక రహస్య నెట్‌వర్క్‌గా ఏర్పడి, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దేవుబాపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు గత ఏడాదే బీజం పడింది. ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్లు లభించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు.
ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.
ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించిన వీక్షకులను సైతం మునివేళ్ల మీద నిలబెట్టేసేంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. అయితే.. ఇదే మ్యాచ్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
రూ.72,000 కోట్ల గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన రాజకీయ వివాదాంశంగా మారింది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ ఉనికిని ఎదుర్కోవడానికి ఇది ఒక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి అని బీజేపీ ప్రచారం చేస్తుండగా, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇది తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి, స్థానిక గిరిజన హక్కులకు హాని కలిగించే ఒక ప్రణాళికాబద్ధమైన దుస్సాహసం అని వ్యతిరేకిస్తోంది.
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.