మిడిల్ఈస్ట్ లో యుద్ధవాతావరణం భయం గొల్పుతోంది. వాణిజ్య నగరం దుబాయ్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. కాన్సులేట్ భవనానికి సమీపంలోని పార్కింగ్ స్థలంలో డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. గత 48 గంటల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా ఇరాన్ డ్రోన్ల దాడికి పాల్పడింది. కాగా ఈ పరిణామాలపై యూఏఈ స్పందిస్తూ.. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వేదికగా మార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drone-attack-in-dubai-36-214952.html
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.