అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎందుకంటే?
Publish Date:Feb 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు కారణంగా ఐదుగురు మరణించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలలో డయోరిగా కారణంగా ఇద్దరు మరణించగా, పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం ఘటనకు సంబంధించి శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అలాగే మంతృల బృందాన్ని జిల్లాకు పంపించింది. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే ఈ ఘటనలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆయా జిల్లాల అధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్న ఆదేశాలకు పెద్దగా స్పందించలేదు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు నామ్ కే వాస్తేగా ఉండటంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు జిల్లాల పరిస్థితిపై గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుంటే తానే రంగంలోకి దిగుతానని తేల్చి చెప్పారు. పని తీరును మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/cm-warn-officers-on-ground-level-tours-36-214724.html





