Publish Date:Apr 15, 2026
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్, అంబర్పేట, అల్వాల్ ప్రాంతాల్లో ఉన్న మీసేవ కేంద్రాల్లో ఈరోజు ఉదయం నుంచే ఏసీబీ అధికారుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. పౌర సేవలకు సంబంధించిన ముఖ్య పత్రాల జారీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల నుంచి దళారుల ద్వారా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా రనే ఫిర్యాదులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. సాధారణంగా తక్కువ ఫీజుతో అందాల్సిన సేవలకు అనవసరంగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు కేంద్రాల్లో పత్రాలు, కంప్యూటర్ రికార్డులు, నగదు లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
తనిఖీల సమయంలో అనుమానాస్పద లావా దేవీలకు సంబంధించిన పత్రాలు, రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో మధ్యవర్తుల పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు, సిబ్బంది నుంచి వివరణలు కూడా తీసుకుంటున్నారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఈ సోదాలు రాష్ట్రంలోని ఇతర మీసేవ కేంద్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-checks-at-meeseva-offices-36-217440.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.