టీటీడీ ఛైర్మన్‌పై విష ప్రచారానికి కోర్టు అడ్డుకట్ట..!
Publish Date:Mar 3, 2026
Advertisement
టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేస్తూ, ఇకపై ఆయనపై ఎలాంటి అసత్య వార్తలు ప్రసారం లేదా ప్రచారం చేయరాదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలు, వీడియోలను తక్షణమే తొలగించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు గూగుల్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలపై కుట్రలో భాగంగా, ఇటీవల టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా దుష్ప్రచారం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/ttd-chairman-br-naidu-36-214949.html





