‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 10, 2026

Advertisement

 

రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ రూపకల్పన, పెట్టుబడులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం అన్నారు. 

ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధనే లక్ష్యం కావాలన్నారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్‌ పైనా మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. వనరుల సద్వినియోగం చేసుకోవాలంటే వాటిపై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు.  
 
రాష్ట్రంలో విలువైన బీచ్ సాండ్ మినరల్స్

రాష్ట్రంలోని తీరప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని, వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బీచ్ సాండ్ మినరల్స్ ఉత్పత్తులు పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ భాగాల వంటి కీలక పరిశ్రమలకు అవసరం అవుతాయని వివరించారు. 

రాష్ట్రంలో లభిస్తున్న మినరల్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందుంచారు. అందులో ఒకటి శ్రీకాకుళంలో టైటానియం పార్క్, సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. రెండవది అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, సంవత్సరానికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం. మూడవది మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్‌. ఈ  సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, మైనింగ్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.