LATEST NEWS
  జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు. జగన్ మాటలు, ప్రకటనలు ప్రజలలో పార్టీని చులకన చేస్తున్నాయని ఆవేదన..ప్రభుత్వ వ్యతిరేకతను మించి జగన్ మీద అపనమ్మకం ప్రజలను ప్రభావితం చేస్తుందనే భయం...రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత మాత్రం సంతృప్తి లేదని అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ నిజం ఒప్పుకొంటున్నారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కొంటున్నామన్న నిర్వేదం వారిని ఆవహించి వుంది. పరిస్థితి ఇట్లనే వుంటే రేపటి ఎన్నికలలో నెగ్గుక రావడం దుర్లభం అన్న భయం కూడా వారిని కలత పెడుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ ఎంత మాత్రం సన్నద్ధం కాలేకపోతున్నది. జిల్లా స్థాయి నాయకులు కొందరు మాత్రమే భవిష్యత్ మీద ఆశతో కొంత చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలలో ఆ ఉత్సాహం, విశ్వాసం కనిపించడం లేదు. మూడు పార్టీల కూటమి, రెండు ప్రధాన కులాల కలయిక కొనసాగినంత కాలం మనమెట్లా గెలుస్తామనే నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నది. రాజకీయ చర్చలు ఆ కోణంలోనే కొనసాగుతున్నాయి. పైస్థాయి నాయకులు మాత్రం, జగన్ ధోరణి చూసి బాధ పడిపోతున్నారు. ప్రజలలో వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పార్టీ అధినేతగా జగన్ సరైన రీతిలో స్పందించడం లేదన్నది వారి అభిప్రాయం. గత పాలనలో జరిగిన పొరపాట్లు లేదా మహా పాపాల వల్ల తాము ఓడిపోయామని, మళ్లీ అధికారం వస్తే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే విశ్వాసాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు.  జమీన్ రైతు సౌజన్యంతో...!
  రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక.. నిలబడి పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తల స్వార్థరహిత త్యాగాల పునాదులపైనే మార్పు రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ వ్యక్తపరిచిన భావోద్వేగం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తీవ్ర ఆంక్షలు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పసుపు సైన్యం ప్రదర్శించిన తెగువ, చూపించిన ఆత్మీయతను ఆయన గుర్తు చేసుకున్న తీరు సభలోని ప్రతి ఒక్కరి గుండెలను తాకింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా 45 రోజుల పాటు సాగిన 'యువగళం' పాదయాత్ర రోజుల నాటి పరిస్థితులను లోకేష్ భావోద్వేగంతో వివరించారు. ఆ రోజుల్లో అడుగడుగునా ఎదురైన తీవ్ర ప్రతిబంధకాలు, భయానక రాజకీయ వాతావరణం, సరైన పోలీసు భద్రత లేకపోవడం వంటి సవాళ్లను సభ ముందుకు తెచ్చారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం వైపు నుంచి తగినంత రక్షణ లభించకపోయినా, రోప్ పార్టీ సరిగా లేని సమయంలో కూడా సామాన్య పసుపు సైనికులు స్వయంగా రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్నారు. "నడువు అన్న.. ఎవరు వస్తారో తోలు తీద్దాం" అంటూ సామాన్య గ్రామీణ యువకులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అండగా నిలబడడం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు; అది ఒక లోతైన భావోద్వేగ బంధానికి నిదర్శనం. ఈ పోరాట ప్రయాణంలో కేసులు, వేధింపులు, ఆర్థిక నష్టాలను తట్టుకుని నిలబడిన కార్యకర్తల త్యాగమే నేడు పార్టీకి మళ్లీ ఊపిరి పోసిందని లోకేష్ ఆవేదనతో, కృతజ్ఞతతో వ్యాఖ్యానించారు. "ఈ రోజు మేమందరం వేదికపై గౌరవప్రదంగా కూర్చున్నామంటే, దానికి వెనుక ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అపారమైన త్యాగం" అని విస్పష్టంగా ప్రకారించారు. తమ నాయకుడికి ఆపద వస్తుందేమోనన్న భయంతో స్వయంగా వీధుల్లోకి వచ్చి, కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ దృశ్యాలు తన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చెప్పారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక కూడా గుర్తుపెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. భయం నీడలో జీవించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆనాడు లభించిన ధైర్యమే నేటి మార్పుకు బీజం వేసింది. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వేదికగా సాగిన ఈ సమావేశం, కేవలం ఒక సాధారణ రాజకీయ ఉపన్యాసంగా కాకుండా, క్షేత్రస్థాయిలో రక్తం చిందించిన సామాన్య కార్యకర్తలకు నాయకుడు అర్పించిన భావోద్వేగ కృతజ్ఞతా నీరాజనంగా నిలిచింది. Nara Lokesh Speech, Nara Lokesh Kurnool Visit, Yuva Galam Padayatra Kurnool, TDP Cadre Sacrifice, Nara Lokesh Emotional Speech, Kurnool TDP Meeting, Lokesh Kurnool Padayatra 45 Days,Telugu Desam Party Activists https://youtube.com/shorts/Q-CVoV6OKuo?si=3ri-MoSdU9wLQZsG
భక్తులు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రతి రూపాయి వెనుక పవిత్రమైన విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన  ఉంటాయి. అలాంటి కానుకలు దుర్వినియోగమైతే భక్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయోధ్య రామాలయానికి భక్తుల సమర్పించిన విరాళాల విషయంలో అదే జరిగింది. అయోథ్య రాముడికి భక్తుల సమర్పించిన విరాళాల్లో 7.5 కోట్ల రూపాయల మేర  అవకతవకలు జరిగా యన్నవార్తలు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.  ఆ అవకతవకలకు, అక్రమాలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్షాలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాయి.  అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పూజారికి  లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా పలువురు  విపక్ష ఎంపీలు   విరాళాలు వేస్తుండగా, పప్పు యాదవ్ వారిచ్చిన సొమ్మును తన జేబులో వేసుకుంటూ చోరీ జరిగిన విషయాన్ని చాటారు. ఆ సందర్భంగా ఎంపీలు చఢావా చోర్, గద్దీ ఛోడ్ అంటూ   బిగ్గరగా నినాదాలు చేశారు. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   Ayodhya donation row, Pappu Yadav protest, Rahul Gandhi, Parliament Makar Dwar, Ram Mandir hundi theft, Opposition protest
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న, ఏపీ అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్ కాబోతున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 1)న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో  భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ  ఎయిర్‌పోర్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది చంద్రబాబు నాయుడి దార్శనికతాఅసలీ క్రెడిట్ వార్ ఏమిటి?  వంటి అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.   హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని డిజైన్ చేస్తున్న సమయంలోనే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో ఓ భారీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలని చంద్రబాబు భావించి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారని అడుసుమిల్లి చెప్పారు.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే..  కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.  2019 ఎన్నికల ప్రచారంలో  జగన్.. ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈగలు తోలుకుంటున్నారు, అక్కడకి వెళ్లేవాళ్లే లేరు, ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ దేనికి?  అంటూ చేసిన విమర్శలను అడుసుమిల్లి అజ్ణానం అంటూ కొట్టి పారేశారు.   గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన భూ సేకరణపై ఎన్నో అనుమానాలు, వివాదాలు రేకెత్తించారు. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన..  నాడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు, శిల్పారామం కట్టినప్పుడు కూడా అందరూ ఇలాగే ఎగతాళి చేశారు. అక్కడెవడు ఉంటాడు? అంత దూరం ఎవడు వెళ్తాడు? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో అర్ధమౌతుందన్నారు.   ముందుచూపుతో వ్యవహరించినవారు ఎప్పుడూ నష్టపోరన్న ఆయన..  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలాగైతే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారిందో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. అందులో ఇసుమంతైనా సందేహం అవసరం లేదని అడుసుమిల్లి అన్నారు.  వైజాగ్  నుంచి  40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు పోటెత్తడం ఖాయమన్నారు.  జగన్ హయాంలో  భూసేకరణను తగ్గించడం, ప్రాజెక్టు పనులను రెండేళ్లపాటు పక్కన పెట్టడాన్నీ గుర్తు చేసిన అడుసుమిల్లి,   2024లో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  భోగాపురం పనులు వేగం పుంజుకున్నాయనీ, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందనీ చెప్పారు.  అయితే తగుదునమ్మా అంటూ ఇప్పుడు జగన్ భోగాపురం క్రెడిట్ కోసం ప్రాకులాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా  ప్రారంభంలో వ్యతిరేకించడం, తర్వాత విమర్శించడం, చివరకు నిజం తెలుసుకుని  క్రెడిట్ చోరీకి పాకులాడటం జగన్ రాజకీయం అని ఎద్దేవా చేశారు.   ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రారంభం కావడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది. ఇది నిస్సందేహంగా చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకుని సాకారమైన ప్రాజక్ట్ అని అడుసుమిల్లి ముక్తాయించారు.  Bhogapuram Airport Launch,  Chandrababu Vision, Jagan Credit Chori Attempts, Uttarandhra Development,   PM Modi Bhogapuram, Telogu One
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు   వైసీపీ అధినేత   జగన్  శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన చేసినన వ్యాఖ్యలు   కొత్త వివాదానికి తెరలేపాయి. సీదిరి అప్పలరాజును జైలులో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుట్ర చేశారని, అప్పలరాజు అంటే చంద్రబాబుకు అసలు పడదని, కక్షపూరితంగానే ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జగన్ గుప్పించిన విమర్శలు పరిశీలకులనే కాదు సామాన్య జనాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెబుతున్నట్లుగా ఈ కేసులో  రాజకీయ ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు  ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.   సీదిరి అప్పలరాజు చేసిన  అతే..  ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.  నిర్లక్ష్యంగా బైక్ నడిపి  ఒక అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో..  నిజాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమేంటన్న చర్చ ఇప్పుడు జనంలో విస్తృతంగా జరుగుతోంది. కేసు ఏమిటంటే..  శ్రీకాకుళం జిల్లా పరిధిలో బుల్లెట్ బైక్‌తో ప్రమాదం జరిగి ఒక సామాన్య గొర్రెల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో బైక్ నడుపుతోంది సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాగా, తన కుమారుడిని ఈ కేసు నుండి తప్పించడానికి మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు.  తన కొడుకు ఆరవ్‌ను బయట పడేసే క్రమంలో, ఆరవ్ స్నేహితుడైన  వేరే యువకుడిని ఈ కేసు ఒప్పుకునేలా ఒత్తిడి తెచ్చారు.  బైకు ప్రమాదం సదరు యువకుడే చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించి కేసు కూడా నమోదు చేయించారు.  అప్పట్లో సీదిరి మాటలను, ఆయన చెప్పిన కథనాన్ని నమ్మిన స్థానిక పోలీసులు, ఆరవ్ స్నేహితుడిపై  కేసు నమోదు చేశారు. అయితే ఈ  వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన గొర్రెల కాపరికి సీదిరి అప్పలరాజు రోడ్డుపై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని ప్రచారం చేసుకున్నప్పటికీ..  అది కూడా వాస్తవం కాదని, దారిన పోతున్న ఒక సాధారణ వ్యక్తి మాత్రమే ఆ సహాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు సీదిరి అప్పలరాజు   అబద్ధపు కథనాన్ని నమ్మి, అక్రమంగా కేసు నమోదు చేసినందుకు గాను శాఖాపరమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం, సంబంధిత సీఐ, ఎస్సైతో సహా పలువురు పోలీసులపై   చర్యలు తీసుకుంది. మొత్తం నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తప్పుడు కేసు కారణంగా నలుగురు పోలీసు అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడగా, మరోవైపు ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడింది. సీదిరి కుమారుడు చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడిని తప్పించేందుకు కుట్రపూరితంగా వేరే వారిపై కేసు పెట్టించడంతో సిదిరి అప్పలరాజు కటకటాల పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయపార్టీ అధినేతగా జగన్ చేయాల్సిందేంటంటే.. బాధితుడి అంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి. అది వదిలేసి.. నిందితులకు పరామర్శలేంటన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.   Jagan Mohan Reddy, Seediri Appalaraju, Palasa accident case, Chandrababu Naidu, AP Political News, AP Police suspension
ALSO ON TELUGUONE N E W S
  యానిమల్ మూవీతో 'త్రిప్తి డిమ్రి'(Tripti dimri)సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన సుందరీమణికి కూడా ఆ స్థాయి క్రేజ్ రాలేదనే చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రెజెంట్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సందీప్ రెడ్డి వంగతో  స్పిరిట్ లో  జత కడుతు ఏ రోజు కా రోజు  టాక్ ఆఫ్ ది డే హోదాలో ఉంటుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న పిక్ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే ముంబై వీధుల్లో అత్యంత సాధారణమైన దుస్తుల్లో, ఎలాంటి ఆడంబరాలు లేకుండా కెమెరా కంటికి చిక్కిన త్రిప్తి డిమ్రికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ షేక్ చేస్తున్నాయి. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో వెలిగే కథానాయికలు బయటకు వస్తే భారీ మేకప్, హై ఎండ్ డిజైనర్ డ్రెస్సులతో హంగామా చేయడం చూస్తూంటాం. కానీ త్రిప్తి  డిమ్రి మాత్రం దానికి పూర్తి భిన్నంగా చాలా సింపుల్‌గా దర్శనమిచ్చింది. ఒక సాదాసీదా వైట్ షర్ట్, దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ప్యాంట్ ధరించి నేచురల్ లుక్‌తోనే ఆమె ప్రదర్శించిన నవ్వు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి హంగులు లేకపోయినా ఆమెలో ఉన్న ఆకర్షణ, సహజమైన గ్లామర్ కాస్త కూడా తగ్గలేదని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. Also read: ఓటిటిలో ల్యాండ్ అయిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్.. నరకడాలు లేవ్ పాపరాజీలు ఆమెను చూసి కెమెరాలలో బంధించేందుకు పోటీ పడగా, త్రిప్తి కూడా అంతే ఎంతో వినయంతో, చిరునవ్వుతో కెమెరాలకు ఫోజులిచ్చింది. తన కారు ఎక్కే ముందు మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించడం, ఎటువంటి గర్వం లేకుండా చాలా క్యాజువల్‌గా మెలిగిన తీరు నెటిజన్ల మనసులని దోచుకుంటుంది.  ఎంటైర్ ఈ సంఘటనతో తేలిన నిజం ఏంటంటే నిజమైన అందానికి మేకప్ అవసరం లేదు, ఆత్మవిశ్వాసమే అసలైన గ్లామర్ అనే నిజం మరోసారి రుజువయ్యింది. Tripti dimri, Prabhas, Spirit
లేటెస్ట్ హాలీవుడ్ సెన్సేషన్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా ₹131 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అతిపెద్ద హాలీవుడ్ ఓపెనింగ్‌ సాధించిన సినిమాగా 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్‌గా ఉన్న 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' దాదాపు ₹65 కోట్లతో టాప్‌లో ఉండేది. కానీ టామ్ హోలాండ్ నటించిన ఈ సరికొత్త స్పైడర్-మ్యాన్ మూవీ మొదటి రోజే ఏకంగా ₹73 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఆ పాత రికార్డుని తుడిచేసింది. స్పైడర్-మ్యాన్ అంటే మన ఇండియన్ ఆడియన్స్‌కు ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచి టీవీల్లో చూస్తూ పెరిగిన క్యారెక్టర్ ఇది. అందుకే మొదటి రోజునే 73 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ బొమ్మ, రెండో రోజు కూడా అదే రేంజ్‌లో హోల్డ్ చేసింది. వర్కింగ్ డే అయిన శుక్రవారం రోజు కూడా ఏకంగా 58 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే టోటల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ 131 కోట్లు దాటేసింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. మొదటి వారంలోనే ₹200 కోట్ల మార్క్‌ను దాటేసి ఆల్ టైమ్ హాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసేలా ఉంది ఈ స్పైడర్ మ్యాన్.     Spider Man Brand New Day, Box Office, India  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ ‘కనకరాజు’ అనే లోకల్ కుర్రాడిగా పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. అలాంటి రూరల్ మాస్ పాత్రలోకి కొరియన్ దెయ్యం ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ట్రైలర్ ఆరంభంలోనే సత్య, రితిక నాయక్ కలిసి కొరియన్ దెయ్యం ఆవాహన పూజ చేసే సన్నివేశం నవ్వులు పూయించింది. ఆద్యంతం ట్రైలర్ లో ఫన్ కనిపించింది. ముఖ్యంగా సత్య పాత్ర థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమాను మలిచినట్లుగా ట్రైలర్ తో అర్థమవుతోంది.  ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్, మేకోవర్, మాస్ డైలాగ్ డెలివరీ మునుపెన్నడూ చూడని రీతిలో ఉన్నాయి. ఒకవైపు పెనుకొండ వాసిగా పక్కా మాస్ లుక్ లో, మరోవైపు కొరియన్ డాన్ గా స్టైలిష్ లుక్ కనిపిస్తున్నాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్.. ఈ 'కొరియన్ కనకరాజు' సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.     Korean Kanakaraju Trailer, Varun Tej, Ritika Nayak, satya comedy, Merlapaka Gandhi  
  ఎక్స్ పైరీ డేట్ లేని జోనర్ ఏదైనా ఉంది అంటే రొమాంటిక్ కామెడీ జోనర్ అని చెప్పవచ్చు. ఈ జోనర్ లో కథ, కథనాన్ని తయారు చెయ్యాలంటే చాలా కష్టం కూడా. అందుకే అరుదుగా దొరికే సినీ డైమండ్ లాగా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాయి. ప్రస్తుతం సెల్యులాయిడ్ తో పాటు ఓటీటీలో ఎటు చూసినా హారర్, మిస్టరీ, క్రైమ్, తీవ్రమైన హత్యలు,రక్తపాతంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ల హోరు ఎక్కువైంది. ప్రతి వారం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వస్తున్నప్పటికీ, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా ప్రశాంతమైన వినోదాన్ని అందించే కంటెంట్ చాలా అరుదుగా మారుతోంది.  అలాంటి తరుణంలో, ఎలాంటి హింస లేదా రక్తపాతం లేకుండా స్వచ్ఛమైన నవ్వులు, మనసుకు హత్తుకునే మిడిల్ క్లాస్ ఎమోషన్లతో ప్రేక్షకులను అలరించేందుకు  సరికొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అదే 'హరిచంద్ర కథ' (Harichandra Katha). ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) లో ఈ సిరీస్ ప్రస్తుతం విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన మరియు విశేషమైన విషయం ఏమిటంటే, దీని నిర్మాణం సాగిన తీరు. సాధారణంగా ఏ చిన్న వెబ్ సిరీస్ చిత్రీకరణకైనా కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ 'హరిచంద్ర కథ' టీమ్ మాత్రం ముందస్తు ప్రణాళిక, పక్కా ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో కేవలం 11 రోజుల్లోనే (11 Days) షూటింగ్ ప్రక్రియని  విజయవంతంగా పూర్తి చేసి ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరిచింది. తక్కువ సమయంలోనే అత్యుత్తమ నాణ్యతతో కూడిన అవుట్‌పుట్‌ను రాబట్టడంలో దర్శకుడు మరియు ప్రొడక్షన్ బృందం చూపించిన సమర్థత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బి2పి స్టూడియోస్ (B2P Studios) బ్యానర్‌పై బిందు కోత ఈ సిరీస్‌ను ఎంతో నిర్మలమైన అభిరుచితో నిర్మించారు. మొత్తం 5 ఎపిసోడ్లుగా (5 Episodes) రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవిక జీవిత సంఘటనలను అత్యంత సరదాగా ఆవిష్కరించారు. కథ విషయానికి వస్తే, ప్రధానంగా నేటి కాలపు ఐటీ ఉద్యోగుల జీవనశైలి, కార్పొరేట్ జాబ్ ఒత్తిళ్లు (Job Stress), ప్రేమాయణాలు, మిత్రుల మధ్య ఉండే సరదా గొడవలు మరియు మిడిల్ క్లాస్ కుటుంబాల భావోద్వేగాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. కథానాయకుడు హరినాథ్ రాజ్ కే (Harinath Raj K) మరియు కథానాయిక హేమా గోర్లే (Hema Gorle) తమ నటనతో నవ్వులు పూయించడమే కాకుండా, సహజమైన ఎక్స్‌ప్రెషన్లతో క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ సీన్లు, హాస్య సన్నివేశాలు వీక్షకులకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తాయి. వీరితో పాటు గోపీచంద్ అల్లా, అర్జున్ శ్రీనివాస్, ప్రవీణ్ కింతలి, శివ ప్రసాద్, వేణు గోపాల్ వంటి నటులు తమ పరిధి మేర మెప్పించి కామెడీ టైమింగ్‌తో అలరించారు. ప్రతీ ఎపిసోడ్‌లోనూ నవ్వులు పూయించే పంచ్‌లు, యువతకు వెంటనే కనెక్ట్ అయ్యే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. కార్తీక్ కృష్ణ (Karthik Krishna) అందించిన దర్శకత్వం, కథనం ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చకచకా సాగిపోతాయి. నితిన్ బాల్జా (Nitin Balja) అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ ఫీల్ గుడ్ డ్రామాకు మరింత ప్రాణం పోశాయి. అలాగే వాసు అందించిన ఛాయాగ్రహణం దృశ్యాలను కలర్‌ఫుల్‌గా ఆవిష్కరించగా, హరినాథ్ రాజ్ కూర్పు సిరీస్ వేగాన్ని పెంచింది. Also read: లెనిన్ ఓటిటి డేట్ ఇదే.. ఇది సరికొత్త ప్రయోగం   ప్రస్తుతం ఓటీటీలో వైలెంట్ కంటెంట్ మధ్య రిలీజ్ అయిన ఈ క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని అందిస్తోంది. వారాంతంలో ఆఫీస్ ఒత్తిడిని మర్చిపోయి, ఇంట్లోనే హాయిగా డిజిటల్ స్క్రీన్ ముందు కూర్చుని కుటుంబంతో సహా వీక్షించేందుకు 'హరిచంద్ర కథ' ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. మరి 'ఆహా' వేదికపై దుమ్మురేపుతున్న ఈ సిరీస్‌ ని  మీరూ మిస్ కాకుండా చూసి నవ్వులని స్టోరేజ్ చేసుకోండి.     Harichandra Katha, Aha
  అఖిల్ అక్కినేని(Akhil Akkineni)గత నెల జూన్ 10 న లెనిన్(Lenin)గా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. పది సంవత్సరాల తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో లెనిన్ ని అఖిల్ తో పాటు అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. వరుస ప్లాప్స్ తో ఫ్రెండ్ షిప్ చేస్తున్న  భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse)కూడా లెనిన్ ని మరిచిపోవడం అనేది జరగదు.  90 కోట్ల రూపాయల వరకు వసూళ్లని సాధించిన లెనిన్ ఓటీటీ హక్కుల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5  ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు 40 కోట్ల రూపాయలకు దక్కించుకోవడం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్లు రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ‘లెనిన్’ నిర్మాతలు అనుసరించిన సరికొత్త పబ్లిసిటీ వ్యూహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిత్రబృందం సాంప్రదాయ సోషల్ మీడియా ప్రకటనలకి  భిన్నంగా, ఒక ప్రముఖ ప్రముఖ వార్తాపత్రికలో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి జీ5 ప్లాట్‌ఫారమ్‌లో ‘లెనిన్’ స్ట్రీమింగ్ కానుందని ఆ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. పత్రికా ప్రకటన రూపంలో ఓటీటీ ముహూర్తాన్ని ఖరారు చేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక వినూత్నమైన ప్రయోగంగా నిలిచింది. ఈ పేపర్ యాడ్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్‌గా మారాయి. అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు ఈ సృజనాత్మక ప్రచారాన్ని ఎంతో ఆసక్తిగా పంచుకుంటున్నారు. Also read: అగస్ట్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సందడి.. మనల్ని ఎవడ్రా ఆపేది థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తయిన నాలుగు వారాల వ్యవధిలోనే, అంటే స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రం డిజిటల్ ప్రసారానికి సిద్ధమవుతోంది.  థమన్ అందించిన నేపథ్య సంగీతం, మురళీ కిషోర్ దర్శకత్వ ప్రతిభ కలిసి లెనిన్ ని  ఓటీటీ వేదికగా కూడా సరికొత్త రికార్డుల వైపు నడిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.   Akhil Akkineni, Bhagyashri Borse, Nagarjuna
The teaser of Crazy Kalyanam was unveiled today, offering a glimpse into the rural comedy packed with humor, family drama, and colorful village characters. But the movie does feel like it is following the recent trend of such entertainers than being unique.  Starring Anupama Parameswaran in the lead, the film is directed by Badrappa Gajula and promises an entertaining story set against the backdrop of a Telangana village. The teaser revolves around the wedding of Anupama Parameswaran's character, with the narrative hinting at a series of hilarious incidents surrounding the marriage. Packed with quirky characters, witty dialogues, and a vibrant rural setting, the film appears to rely on situational comedy while capturing the flavor of Telangana culture. Tharun Bhascker, Naresh, Akhil Raj Uddamari, and Kireeti play key roles, and the teaser gives each of them moments that add to the fun quotient.  The chemistry among the ensemble cast and the rustic atmosphere suggest that the makers are aiming for a wholesome family entertainer. Produced by Boosam Jagan Mohan Reddy, Crazy Kalyanam features music composed by Suresh Bobbili. With the teaser generating positive first impressions, the film looks set to offer audiences a light-hearted rural comedy filled with laughter and wedding-day chaos.   Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. ఒకే ఏడాది ఆయన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి ఒక్కో సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతోంది. అలాంటిది అల్లు అర్జున్ మాత్రం వచ్చే ఏడాది 2027లో ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించబోతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి యూరప్‌లో కొన్ని వారాల పాటు సాగిన వెకేషన్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. అలా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారో లేదో, వెంటనే తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాకా' కొత్త షూటింగ్ షెడ్యూల్ కోసం ముంబై చేరుకున్నారు. ముంబైలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైంది. చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ 2026 చివరి నాటికే 'రాకా' సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు. 2027 సమ్మర్ తర్వాత ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ సిద్ధం చేశారు. 'రాకా' సినిమా పనులు పూర్తికాగానే, డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టైల్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన పక్కా ప్లానింగ్‌తో, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేయడంలో దిట్ట. అల్లు అర్జున్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేసేలా లొకేష్ తన మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2027 డిసెంబర్ నాటికి ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలోకి తీసుకురావాలని డెడ్‌లైన్ పెట్టుకున్నారు. మొత్తానికి ఒకే ఏడాదిలో రెండు భారీ సినిమాలతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.     Allu Arjun, Raaka Movie, AA23 Movie  
  అగస్ట్ నెల వచ్చేసింది. ఈ నెల ఎవరికీ ఎలా ఉంటుందో తెలియదు గాని సినీ ప్రియుల రాశి ఫలం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండనుందని చెప్పవచ్చు.ఎందుకంటే   ఒకటి కాదు రెండు కాదు పలు క్రేజీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా సెల్యులాయిడ్ పై సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.    మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరియన్ కనకరాజు'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి విడుదలైన పోస్టర్ల వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని మరియు భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, గ్లామరస్ బ్యూటీ దక్ష నగార్కర్ ఒక ప్రత్యేక గీతంలో అలరించబోతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ బాక్సాఫీస్ హంగామాలో తదుపరి భారీ ఆకర్షణగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' నిలవనుంది. ఇటీవల 'కరుప్పు' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న సూర్య, ఈసారి తెలుగు మరియు తమిళ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రంలో లేటెస్ట్ క్రేజీ బ్యూటీ మమతా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ కానుకగా ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. Also read: ప్రభుదేవా చేసేది డాన్స్ కాదు, ఆ సీక్రెట్ ఏంటంటే.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్  అంతేకాకుండా, మాస్ మహారాజా రవితేజ మరియు క్లాసిక్ ఎమోషనల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఇరుముడి'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొంది ట్రెండింగ్‌లో నిలిచాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై అభిమానుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ సిద్ధమయ్యారు. 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సాధించిన యష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ స్పెక్టాకిల్ 'టాక్సిక్'. ప్రతిభావంతమైన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి వెలువడిన ప్రతి అప్‌డేట్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ విధంగా ఆగస్టు నెల సినీ ప్రియులకి అన్ని బాధలు మర్చిపోయి నూతనోత్సాహాన్ని ఇవ్వడానికి ముస్తాబు అవుతుంది. korean kanakaraju, viswanath and sons, Toxic, irumudi
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ జయప్రద.. ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.  1940ల నేపధ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ కథలో ఎమోషన్స్ చాలా కీలకం. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ ఉంటాయట. 'సీతారామం' సినిమాలో ఎమోషన్ ఎంతలా వర్కవుట్ అయిందో చూశాం. ఇప్పుడు ఫౌజీలో కూడా ప్రభాస్ - జయప్రద మధ్య వచ్చే మదర్-సన్ సెంటిమెంట్ సీన్లు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి కూడా ఒక పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. 1940 పీరియడ్ లొకేషన్లు, ఆ కాలం నాటి ఆర్మీ వాతావరణం, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ అభిమానులకు మరో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఆగస్టు 14న 'ఫౌజీ' చిత్రం నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ భారీ మూవీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.      Fauzi Movie, Prabhas, Jaya Prada, Hanu Raghavapudi, Imanvi  
  మూతిపై సరిగ్గా మీసాలు కూడా మొలవకుండానే దక్షిణ భారతీయ చలన చిత్ర చరిత్రలో డాన్స్ మాస్టర్ గా ప్రభుదేవా(Prabhudeva)సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని ఎవర్ గ్రీన్ సాంగ్' అబ్బని తియ్యని దెబ్బ' నే స్మాల్ ఎగ్జామ్ పుల్. ఆ విధంగా  హిస్టరీ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసే రిపీట్ గా చెప్పుకుంటూనే ఉంటాం. స్టెప్స్ లో తనదైన బాడీ మూమెంట్ ఇచ్చి హీరోలకి ఫ్యాన్ బేస్ పెంచిన మాస్టర్ కూడా. భరత నాట్యానికి కి సంబంధించి కూడా ప్రావీణ్యం ఉందనేలా తనే హీరోగా వచ్చిన ప్రేమికుడు మూవీలో భరత నాట్యం కూడా చేసాడు.  చెన్నై నగరం వేదికగా ప్రభుదేవా గురువు శ్రీ ఉడుపి లక్ష్మీనారాయణన్ 100వ జయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించబడ్డాయి. తన గురువుకు ఘన నివాళి అర్పిస్తూ ఈ ప్రత్యేక సందర్భంలో ప్రభుదేవా వేదికపై భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. గురువు గారి నూరు సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని చాటుకోవడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. కొందరు అభిమానులు ప్రభుదేవా  గురుభక్తిని కొనియాడగా, సాంప్రదాయ శాస్త్రీయ నృత్య అభిమానులు మరియు ప్రొఫెషనల్ డ్యాన్సర్ల నుండి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై ప్రముఖ నటి, శిక్షణ పొందిన నాట్య కళాకారిణి ప్రీతి సంజీవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభుదేవా ప్రదర్శనపై కఠిన వ్యాఖ్యలు చేశారు. "శాస్త్రీయ నృత్యం మాత్రమే పదే పదే తప్పుగా ప్రదర్శించబడుతోంది, అయినా ప్రజలు దాన్ని ప్రశ్నించకుండా ఆదరిస్తున్నారు. ప్రభుదేవా వంటి గొప్ప దిగ్గజ నటుడు మరియు నాట్యకారుడు ఇంత పెద్ద క్షమించరాని తప్పు చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాల వంటి పవిత్రమైన వేదికపై ప్రభుదేవాకు బదులుగా భరతనాట్యంలో ఎంతో కష్టపడి శిక్షణ పొందిన యువ నాట్య కళాకారులకి  అవకాశం ఇచ్చి ఉంటే, వర్ధమాన కళాకారులకు అది ఒక గొప్ప గుర్తింపుగా ఉండేది అని  వ్యాఖ్యానించారు. also read: రాశీఖన్నాకి అరుదైన బహుమతి ఇచ్చిన స్టార్ హీరో..మనతోనే మనం గడుపుతున్నామా! ప్రీతి చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, నాట్య ప్రేమికులు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యాల వ్యాకరణం, నియమాలు, సంప్రదాయాలు చాలా పవిత్రమైనవని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని ఒక వర్గం వాదిస్తోంది. శాస్త్రీయ కళల అసలు రూపాన్ని దెబ్బతీయకూడదని వారు చెబుతున్నారు. అయితే మరొకవైపు ప్రభుదేవా అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఇది కేవలం తన గురువుకు అర్పించిన ఆత్మీయ నివాళి మాత్రమేనని, దీనిని సాంకేతిక కోణంలో కాకుండా భావోద్వేగం, గురుభక్తి దృష్టితో చూడాలని అభిప్రాయపడుతున్నారు. భారతీయ నృత్య రంగానికి ప్రభుదేవా చేసిన సేవలు అమోఘమైనవని, ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మద్దతుదారులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలలో కళాకారులకు ప్రయోగాల స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను ఎంతవరకు కాపాడుకోవాలి? అనే అంశాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.  Prabhu Deva,  Preethi Sanjeev  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే.. పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు.. జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు. ఇతరులకు మర్యాద ఇవ్వడం.. జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం.. జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి. ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం.. జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట. ఒకసారి ఒక పనినే చేయడం.. పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.                                  *రూపశ్రీ.  
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. చిట్బొట్ల మధుసూదన్ శర్మ మోకాళ్ల నొప్పిని తగ్గించేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజమైన చిట్కాను వివరించారు. కేవలం మూడు సాధారణ వంటింటి పదార్థాలు అయిన వెల్లుల్లి, పసుపు, నూనెతో తయారయ్యే ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ చిట్కా మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చని ఆయన తెలిపారు. అయితే ఫలితాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: • మోకాళ్ల నొప్పికి సహజమైన ఇంటి చిట్కా • వెల్లుల్లి, పసుపు, నూనెతో మిశ్రమం తయారీ విధానం • రాత్రి ఎలా ఉపయోగించాలి? • ఈ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు • ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల ఆరోగ్యం, కీళ్ల సంరక్షణ, సహజ వైద్య చిట్కాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.  
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  అంతేకాదు.. ఉదయం లేవగానే బాగా చిరాకుగా, తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. ఉదయం లేవగానే ఇలా ఎందుకు తలనొప్పి వస్తుందని కొందరికి సందేహం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు.  కానీ ఇది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే  తలలో బరువుగా, నొప్పిగా లేదా ఒత్తిడిగా అనిపించడం  అనేది లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు.ఇది కొన్ని సందర్బాలలో తీవ్రమైన అనారోగ్యాలకు ప్రారంభ లక్షణం కావచ్చని అంటున్నారు. ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉండే ఆరోగ్య సమస్యలు ఏమిటి? దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డీహైడ్రేషన్.. రాత్రిపూట శరీరం చాలా గంటల పాటు విశ్రాంతిలో  ఉంటుంది.  దీనివల్ల ఉదయానికి లైట్ గా డీహైడ్రేషన్  ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్  మెదడు చుట్టూ ఉన్న ద్రవ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది, ఇది తలనొప్పికి దారితీస్తుంది. రోజంతా తక్కువ నీరు త్రాగినా లేదా వేసవిలో అధికంగా చెమట పట్టినా ఈ ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం , రోజంతా 2.5 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి.. ఆరోగ్యకరమైన శరీరం , మనస్సు కోసం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. ఆలస్యంగా నిద్రపోవడం, తరచుగా మేల్కొనడం లేదా తగినంత నిద్ర లేకపోవడం  దినచర్యలో భాగమైతే, ఉదయం తలనొప్పులు రావడం చాలా కామన్ అంటున్నారు వైద్యులు. నిద్రలేమి మెదడుకు తగినంత విశ్రాంతిని ఇవ్వదు, దీనివల్ల ఒత్తిడి పెరిగి, నొప్పిని కలిగించే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. అందువల్ల, టైమ్ కు తగ్గట్టు  నిద్రపోవడం , తగినంత నిద్ర పొందడం ముఖ్యం. స్లీప్ అప్నియా.. స్లీప్ అప్నియా అనేది నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోయే ఒక పరిస్థితి. దీనివల్ల శరీరానికి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా నిద్రలేచినప్పుడు తలనొప్పి, అలసట , మగతగా ఉండటం వంటివి సంభవించవచ్చు. బిగ్గరగా గురక పెట్టడం, తరచుగా నిద్రలేవడం , పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వంటివి సాధారణ లక్షణాలు. ఈ సమస్యలు కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. మైగ్రేన్.. మైగ్రేన్లు సాధారణ తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇవి తలలోని ఒక భాగంలో తీవంగా, కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పిని కలిగిస్తాయి. ఇది గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా ఉంటుంది. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే మైగ్రేన్లు మొదలవుతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, చాలా బ్రైట్ గా ఉండే కాంతికి గురికావడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్లతో పాటు వికారం, వాంతులు,  ఎక్కువ కాంతి లేదా శబ్దం వల్ల అసౌకర్యం కూడా కలగవచ్చు. మైగ్రేన్లు తరచుగా వస్తుంటే, నరాల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అధిక రక్తపోటు.. రక్తపోటు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటే, ఉదయం పూట తలనొప్పి ఒక సంకేతం కావచ్చు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి రోగికి తలనొప్పి రాకపోయినప్పటికీ, అదుపులో లేని రక్తపోటు మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. తలనొప్పితో పాటు తల తిరగడం, దృష్టి మసకబారడం లేదా ఛాతీ నొప్పి వంటివి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ,  వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం.. రాత్రి సమయంలో ఎక్కువగా కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురై, మరుసటి రోజు ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అధికంగా కెఫీన్ తీసుకోవడం లేదా అకస్మాత్తుగా కెఫీన్‌ను మానేయడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. రాత్రి ఆలస్యంగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం వల్ల ఉదయం తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేయాలి, మద్యానికి దూరంగా ఉండాలి,   పుష్కలంగా నీరు త్రాగాలి.                                           *రూపశ్రీ.  
  టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఇవన్నీ చిన్నవే అని కూడా అనుకుంటారు. కానీ అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. చేతి  వేళ్లలో ఎప్పుడైనా ఒక రకమైన వింత అనుభూతి,  పట్టులో మార్పు, లేదా తరచుగా అసౌకర్యం వంటివి  అనుభవిస్తే, దాన్ని 'పింకీ ఫింగర్' సిండ్రోమ్ అని అంటారట.  చాలామందికి దీని గురించి తెలియదు.  అయితే ఈ సమస్య ఎవరూ నిర్లక్ష్యం చేయకూడని సమస్య.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..   పింకీ ఫింగర్ సిండ్రోమ్ అంటే.. పింకీ ఫింగర్ సిండ్రోమ్ అనేది చిటికెన వేలు , దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేసే ఒక సమస్య. ఇది తరచుగా ఉల్నార్ నరంపై ఒత్తిడి వలన సంభవిస్తుంది.  ఈ నరం చిటికెన వేలుకు , ఉంగరపు వేలులోని కొన్ని భాగాలకు స్పర్శ జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ నరంపై ఒత్తిడి పడినప్పుడు, అది వేళ్లలో జలదరింపు, తిమ్మిరి , నొప్పికి కారణమవుతుంది. పింకీ ఫింగర్ సిండ్రోమ్ లక్షణాలు.. చిటికెన వేలులో తిమ్మిరి లేదా చిమచిమలాడటం, చేతిలో బలహీనతగా అనిపించడం ఈ సమస్యలో ప్రదాన లక్షణం.  అలాగే..  వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నా,  వేళ్లలో నొప్పి లేదా మంటగా అనిపించడం. భుజాన్ని ఎక్కువసేపు వంచి ఉంచితే సమస్య పెరుగడం వంటి లక్షణాలు ఉంటాయి. పింకీ ఫింగర్ సిండ్రోమ్ ఎలా నివారించాలి?  చేతులను ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉంచకూడదు,  మొబైల్ వాడేటప్పుడు సరైన పొజిషన్ లో వాడాలి.  అప్పుడప్పుడు  చేతులను, వేళ్లను సాగదీయాలి. మోచేతిపై నిరంతరం ఒత్తిడి పెట్టడం మానుకోవాలి. నొప్పి లేదా తిమ్మిరి ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..  పింకీ ఫింగర్ సిండ్రోమ్  ప్రారంభ లక్షణాలు తరచుగా తేలికపాటివిగా ఉంటాయి, కాబట్టి ఈ లక్షణాలు సాధారణ అలసట లేదా అధికంగా పని చేయడం వల్ల    కనిపిస్తున్నాయేమో అని లైట్ గా తీసుకుంటారు.  అయితే, చిటికెన వేలు లేదా చేతితో సమస్యలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. కొంతమందిలో సమస్య ముదిరే కొద్దీ, వారు చేతి కండరాలలో బలహీనత, వేళ్లను కదపడంలో ఇబ్బంది లేదా మంటగా అనిపించడం వంటి లక్షణాలను కూడా ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు చాలా రోజులు లేదా వారాల పాటు కొనసాగితే న్యూరాలజిస్ట్ లేదా ఆర్థోపెడిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. అవసరమైతే వైద్యుడు శారీరక పరీక్ష, నరాల పరీక్ష లేదా ఇతర పరీక్షల ద్వారా సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలుగుతారు.  సకాలంలో చికిత్స చేయడం ద్వారా నరాలపై ఒత్తిడిని తగ్గించి, పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు. అందువల్ల చేతులు లేదా వేళ్లలో  మార్పులను  గమనిస్తే వాటిని విస్మరించకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.                                *రూపశ్రీ.