బొద్దింకల ఉద్యమం: ఓ హిస్టారికల్ నెసిసిటీ.!

Publish Date:Oct 24, 2026

Advertisement

ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ప్రజా ఉద్యమాలు పోటెత్తడం సహజం. ఇండియాలో ఇప్పుడు అదే జరుగుతోంది. దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ వైఫల్యాల ఫలితమే దేశంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న పోరాట జ్వాలలు, నిరసనల మంటలు. ముఖ్యంగా బొద్దింకల వీధి పోరాటాలు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పునాదులను కదిలిస్తున్నాయి. కనీసం కదులుతున్నాయన్న భయాన్ని మోడీషాలో వ్యక్తమయ్యేలా ఈ ఉద్యమాలు చేశాయి. 

 అన్ని వ్యవస్థలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత న్యాయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అందుతోదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంట పరిస్థితి ఏర్పడించి కానీ.. ఇంతల ఈ రాజ్యంగ సంస్థలను వ్యవస్థీకృతంగా గుప్పెట పెట్టుకున్న సందర్భం మాత్రం గతంలో ఎన్నడూ లేదు. 

 కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆందోళనలతో తీవ్రమైన చిక్కులు ఎదుర్కున్న కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్‌ను ఆందోళనల నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఆందోళనలకు, ధర్నాలకు ఇంత కాలం వేదికగా వుంటూ వస్తున్న జంతర్ మంతర్ ఇప్పుడు ఆందుకు ఏ మాత్రం అవకాశం లేని ప్రాంతంగా మారిపోయింది. అయితే, సిజెపి నాయకులు ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ జంతర్ మంతర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురేసినందుకు అరెస్టయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు అరెస్టయిన తొలి భారతీయులుగా వారు చరిత్రలో నిలిచిపోతారు వారిని అరెస్టు చేసి తీహార్ జైలులో వుంచి, బెయిల్ ఇవ్వడానికి అనేక సాకులు చూపుతూ వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.   అవసరమైన షూరిటీలు సమర్పించినప్పటికీ వారి విడుదలకు అడ్డంకులు సృష్టించారు.  

అది పక్కన పెడితే..  అంకితా భండారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమిస్సూ నిస్పిగ్గుగా వ్యవహరించింది కేంద్రం. అలా నియమించడం ద్వారా హత్య కేసులో విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా దుష్యంత్ కుమార్ గౌతమ్ కు వెసులుబాటు కల్పించింది.  ఇక  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేయడానికి ఉత్సుకత చూపిన హత్య కేసులో దోషిగా నిర్దారించబడిన  దోషి నందలాల్ రాయ్ అలియాస్ బబ్లూ రాయ్‌ని అలహాబాద్ హైకోర్టు విడుదల చేసింది.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే..  జంతర్ మంతర్ వద్ద జాతీయ  పతకాన్ని ఎగురవేసిన ఇద్దరు యువకులకు  బెయిల్ ఇవ్వడానికి   స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రితూ రాజ్ మీనమేషాలు లెక్కించారు. షూరిటీ  ఇవ్వడానికి వచ్చిన ఓ వ్యక్తి జుట్టు  ఆధార్ కార్డులో అతపి  ఫొటోలో వున్న జుట్టులా లేదంటూ అభ్యంతరం చెప్పారు. షూరిటీలు అంగీకరించకుండా వారిద్దరి జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు.  గ్యాంగస్టర్లు, రేపిస్టులు, హంతకులు  దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ సీజేపీ కీలక నాయకుడు  ధ్రువ్ రాఠీ విమర్శించడాన్ని, అకారణంగా  ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ జ్యుడిషియల్ కస్టడీనికి పొడగించారనీ, కళ్ల ముందే న్యాయవ్యవస్థ విఫలమవుతున్నదనడానికి ఇదే నిదర్శనమని సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్న సింగ్ ఆక్షేపించడాన్నిఎవరూ తప్పుపట్టలేరు.  ఎన్నికల ర్యాలీల సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు కావడం లేదా, నిరసనల వల్ల మాత్రమే ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయా అంటూ పలువురు ప్రశ్నించడాన్ని కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. న్యాయం ఒకేరకంగా అందరికీ అందడం లేదనడానికి  ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ ఉదంతమే తాజా నిదర్శనం.  

[CJP Agitation Historic Necicity,  Jantar Mantar Protests,Arrest Ashutosh Rana, Dhruv Rathee,Constitutional Institutions, Telugu One]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.