Publish Date:May 23, 2025
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Publish Date:May 23, 2025
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Publish Date:May 23, 2025
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
Publish Date:May 23, 2025
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
Publish Date:May 23, 2025
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
Publish Date:May 23, 2025
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
Publish Date:May 23, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
Publish Date:May 23, 2025
కల్వకుంట్ల కవిత తన తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్రమేనట. వచ్చే రోజుల్లో కవిత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. కారణం కవిత పార్టీ బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం.
Publish Date:May 23, 2025
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Publish Date:May 23, 2025
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Publish Date:May 23, 2025
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Publish Date:May 23, 2025
నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది.
Publish Date:May 23, 2025
పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది.