Publish Date:Mar 25, 2025
లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి. వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది. అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు 2023 నుంచి అమలులోకి వస్తుంది. రెండేళ్ల అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు. ఇప్పుడు అదనంగా 24 వేల రూపాయలు అందుతుంది. అంతే కాకుండా వారికి డిఏ కూడా 500 రూపాయలు పెరిగాయి. ఆఫీసు నిర్వహణకు,ఇంటి అద్దెకు నెలకు గరిష్టంగా రెండు లక్షల60 వేలు వస్తుంది. విమాన ప్రయాణాలు అయితే ఏడాదికి 34 సార్లు ఉచిత ప్రయాణం. ఉచిత విద్యుత్, నీరు తదితర అలవెన్సులు ఇస్తారు. ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడంలో తప్పులేదు. గతంలో అన్నీ త్యాగం చేసి ఎంపీలుగా పనిచేసిన వారు పదవి పూర్తయిన తరువాత బతకడం కష్టంగా ఉండేది.
ప్రజా ప్రతినిధులకు జీతాల పెంపు పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారి పింఛన్ల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సామాజిక పింఛన్లే 4000 రూపాయలు ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే కావడంతో , ఇటువంటి వారి పెన్షన్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అదే విధంగా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది. సరైన మద్దతు ధర లభించడంలేదు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే ధరకు, అది వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో ఉన్న ధరకూ వ్యత్యాసం భారీగా ఉంటోంది. అంటే రైతు కష్టం దళారుల పాలౌతోంది. ఈ దళారి వ్యవస్థను తొలగించి రైతుకే నేరుగా లాభసాటిగా ఉండేలా ధ్యాన్యం విక్రయాలు నెరపుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దేశంలోని అన్ని వర్గాలకు కనీస అవసరాలకు సరిపడా వేతనం లేదా పింఛన్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వృద్ధులకు 70 ఏళ్ల తరువాత ఉచిత ఆరోగ్యం కల్పిస్తామని ప్రధాని పేరుమీద పథకం ప్రకటించారు. కాని దాన్ని 60 ఏళ్ల నుంచి అమలు చేయాల్సిఉంది. దేశాన్ని ఇన్ని సమస్యలు పట్టి పీడిస్తుండగా అత్యంత జరూరుపనిలోలాగా ఎంపీల జీతాల పెంపు కార్యక్రమం చేపట్టడం పట్ల ఒకింత అసంతృప్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంపీల జీతాల పెంపుతో6పాటే.. రైతులజీవితాలు,వృద్ధుల జీవితాలు బాగుపడే నిర్ణయం కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mps-salaries-hike-ok-39-194960.html
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు.
పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
సింథటిక్ నెయ్యితో స్వామివారికి లడ్డూలు చేసి పెట్టిన పాపం ఊరకే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్యలు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.