ఇది మూడో ప్రపంచ యుద్ధమేనా?
Publish Date:Mar 7, 2026
Advertisement
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా పరిష్కరించడానికి భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి. బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి. తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.
http://www.teluguone.com/news/content/is-it-third-world-war-39-215166.html





