అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం.. అనుభవాల సారం వృద్దుల జీవితం.. !

Publish Date:Oct 3, 2026

Advertisement

 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. !

వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే..

వృద్దుల జీవితం..

 తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే.

సమయమే ఇవ్వడం లేదు..

ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది.

సంరక్షణ..

వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి.

పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం..

వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

                            *రూపశ్రీ.

 

By
en-us Political News

  
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.