హైదరాబాద్ నడిబొడ్డున లవ్ జిహాద్
Publish Date:Apr 5, 2026
Advertisement
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు. అనంతరం పెళ్లి చేసుకొని సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరింపులకు గురి చేశారు. కానీ ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి షాప్ అద్దెకు కావాలని నవాజ్ అనే వ్యక్తి వచ్చాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం యువతిని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆయువతి కోసం ఆ యువ కుడు నవ దుర్గా గా పేరు మార్చుకుని అమ్మాయిని పూర్తిగా నమ్మించాడు. అనంతరం 2025 జూన్‌లో వివాహం చేసుకున్నాడు. కూకట్ పల్లి నుంచి పంజా గుట్టకు మకాం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసాడు. అతని సోదరులు, స్నేహితులైన షేక్ మునావర్, షారుక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. అనంతరం యువతీకి కూడా మత్తు మందు ఇచ్చి అందరూ అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరింపులకు గురి చేశారు. అంతేకాకుండా పెళ్లి అనంతరం ఆ యువతికి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్స్ తీయించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పింది. నవాజ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యా చారం జరిగిందని... అతనికి గతంలోనే రెండు పెళ్లిళ్లు జరిగాయని, నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించే వాడని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో కూకట్ పల్లి పోలీసులు యువతిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బులు వ్యాపారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం పై జీరో ఎఫ్‌ఐఆర్ చేసి పంజాగుట్టకు పంపించారు... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు...
http://www.teluguone.com/news/content/love-jihad-in-hyderabad-36-216714.html





