తెగ తాగేశారు...మద్యం విక్రయాల్లో ఆ జిల్లా రికార్డు!
Publish Date:Apr 5, 2026
Advertisement
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు. సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించారు. మమూడురోజుల క్రితం ముగిసిన గత ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా గుట గుటా తాగేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెబుతున్న ఈ మధ్యం విక్రయాలకు వేలా పాలా లేదు. తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగిస్తూ ఉండడం తో ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరికే పరిస్థితి రోడ్లపై కనిపిస్తుంది. ఇందుకు తోడు బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో కావలసిన వారికి కావల్సినంత మందు దొరుకుతుంది. దీంతో ముందు బాబులు మద్యం మత్తులో మునిగి జిల్లాను కూడా మత్తులో తడిపేశారు *ఖజానాకు కాసుల వర్షం *కష్టం జీవుల వాటానే అధోకం కోట్ల రూపాయల ఆదాయంలో 80 శాతం వాటా రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడిదేనని చెప్పవచ్చు.కొందరైతే *రూ,1155.77 కోట్ల విక్రయాలు జిల్లాలో ఏర్పాటైన 139 మద్యం షాపుల ద్వారా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలోని 9 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 1155. 77 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగడం చూస్తే మందుబాబులు మద్యం తాగడానికి మాత్రం లోటు లేదనే చెప్పాలి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లవారిగా జరిగిన మద్యం అమ్మకాలు పరిశీలిస్తే బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలో 128.85 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే జమ్మలమడుగులో 84.57 కోట్లు, కడప లో 312. 37 కోట్లు ,ముద్దనూరు లో 47.76 కోట్లు ,మైదుకూరులో 112.23 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్ పరిధిలో రూ,202.72 కోట్లు, పులివెందులలో 138.77 కోట్లు, సిద్ధవటంలో 36.79, కోట్లు , ఎర్రగుంట్ల లో91.71 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. తొమ్మిది పోలీస్ స్టేషన్లో పరిధిలో 1155.77 కోట్ల రూపాయల మధ్య విక్రయాలు కరువు కడపన రికార్డు సృష్టించాయి *మొదటి స్థానంలో కడప మద్యం సేవించడంలో కడపలో మందుబాబులు మొదటి స్థానంలో ఉన్నారు. కడప ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 312.37 కోట్ల రూపాయలు మద్యం తాగేశారు .రెండో స్థానంలో ప్రొద్దుటూరు లో 202. 72 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. మూడో స్థానంలో 138.77 కోట్లతో పులివెందుల ఉంది .నాలుగో స్థానంలో బద్వేలు లో 128 .85 కోట్ల రూపాయల మద్యం సేవించారు. మొత్తంగా ఏడాదికి 1155.77 కోట్ల రూపాయలు మద్యం తాగారంటే కడప కు ఏస్థాయిలో మత్తెక్కించారో ఊహించ వచ్చు. *ఒక్క నెలలో 11.66 లక్షల బీర్లు గుట గుట వేసవి తాపం తీరేలా చిల్డ్ చిల్డ గా గుట గుట బీర్లు తాగేశారు. గత నెల లో ముదిరిన ఎండలు బీర్లకు బలే గిరాకీ తెచ్చాయి. ఈ మర్చ నెలలో జిల్లాలో 97424 కేసులు అంటే 1168088 బీర్లు తాగేశారు. ఫిబ్రవరి వారిలో 66965 కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే మార్చి లో అంతకు మించి 32759 బీర్లు అదనంగా అమ్మకాలు జరిగాయి. నియోజకవర్గాల వారీగా 'మత్తు' లెక్కలు (మార్చి నెల గణాంకాలు):
ఏడాదికి రూ. 1,155.77 కోట్ల ఆదాయం అంటే నెలకు సగటున రూ. 96.31 కోట్ల రూపాయలు మధ్యం తాగేశారు .కొత్త మద్యం విధానంతో నాణ్యమైన బ్రాండ్ల పేరుతో గత ప్రభుత్వంలో కనిపించని బ్రాండ్ లు అందుబాటులోకి రావడంతో విక్రయాలు మరింత పుంజుకున్నాయి. కేవలం మార్చి నెలలోనే రూ. 101.96 కోట్లు ఆదాయం రావడం గమనార్హం.
సాయంత్రం వేళ కూలీ డబ్బులతో నేరుగా మద్యం షాపులకే చేరుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయి.మద్యానికి బానిసలై వారి పిల్లలు భవిష్యత్తు పై ఈ ప్రభావం పడుతోంది. తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారుతున్నారు. మితిమీరి మద్యం సేవించడం వల్ల వల్ల లివర్, కిడ్నీ వ్యాధులతో చిన్న వయసులోనే పురుషులు మరణిస్తున్నారు. దీంతో అనేక కుటుంబాల్లో మహిళలు అనాథలుగా, పిల్లలు దిక్కులేని వారిగా మారుతున్నారు.
జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మద్యం విక్రయాల సరళిని పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల్లో వినియోగం అత్యధికంగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే 101 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది.ఏప్రిల్ ఒకటి నుండి మొదలైన 2026- 27 ఆర్థిక సంవత్సరంలో మరెంత స్థాయిలో మద్యం మత్తు కడప ను ముంచెత్తిందో చూడాలి.
http://www.teluguone.com/news/content/kadapa-district-sets-record-in-liquor-sales-36-216708.html





