సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు
Publish Date:May 13, 2026
Advertisement
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నెల 24తో ఆయన గడుపు 2026 మే 24తో ముగియనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఈ పొడిగిపును క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 2023లో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గతేడాది మే నెలలో తొలిసారి ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
ఇప్పడు మరో ఏడాది పాటు ఈ దర్యాప్తు సంస్థకు అధిపతిగా కొనసాగుతారు. ఈ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ నేతృత్వలోని ఉన్నతస్థాయి ఎంపిక ప్యానల్ సమావేశంలో విపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/cbi-directors-term-extended-36-219709.html





