ఇలా చేస్తే ..అన్ని కలిసొస్తాయి

Publish Date:Jan 4, 2021

Advertisement

కొందరిని చూస్తే ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఎప్పుడు ఆనందం గా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏది కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకం గా నిలబెడతాయి . ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా ? పాజిటివ్ మైండ్ సెట్ ...తో జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం . ఆ ఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకం గా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాసం కనిపిస్తుంది .అంటున్నారు ఆయన. మరి అలాంటి మాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే ? ఆయన చెబుతున్న ఈ కింది వాటిని ఫాలో అవ్వటమే.

 

లోపలినుంచి మొదలు కావలి ..

మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతం గా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆ ప్రశాంత తని  అలవాటు చేయాలి. దానికోసం రోజు ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు . ఆ రోజు లో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలు ని ఆందోళన పడకుండా దాటగలుగుతాము .ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది . సమస్యలు కి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతం గా వుండటం వల్లే సాధ్యమవుతుంది .

 

ఓ చిన్న మంత్రం

ఇది కూడా గడిచి పోతుంది ...ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలా సారులు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురయ్యిన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి . అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రం లో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగి పోవటం లో అర్ధం లేదుకదా

 

నీకు నీవే శత్రువు కావద్దు

ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు ..నేనింతే ..అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువు తో పోరాడలేము , గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి .అంతే సగం బాధ తీరిపోతుంది. చాలా సారులు జరిగిన విషయాన్నే తలుచుకు , తలుచుకు బాధ పడుతుంటారు . దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.

 

చుట్టూ వైఫైలా వుండాలి

మంచి ఆలోచనలతో , ఉత్సాహం గా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వబావం మూలం గా మనం కొని తెచ్చు కునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.

 

ప్రతి చిన్న విజయం విలువైనదే

ప్రతి రోజు చిన్నదో , పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే.ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది.

 

By
en-us Political News

  
శీతాకాలంలో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా? చలికాలంలో హైడ్రేషన్, ఆరోగ్యకరమైన పానీయాలు, డైట్ చిట్కాలతో ఫిట్‌గా ఉండే అద్భుతమైన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
కాంతివంతమైన, మచ్చలేని మరియు సహజమైన చర్మం కోసం పచ్చి పాలను ఏ విధంగా ఉపయోగించాలో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి. ఇంట్లోనే సులభంగా చర్మాన్ని మెరిపించే చిట్కాలు.
వైరల్ ఫీవర్ మరియు కోవిడ్ 19 తర్వాత గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి తెలుసుకోండి. మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ సమస్యలను సూచించే 5 ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా తయారయ్యే సాంప్రదాయ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర తయారీ విధానం మరియు పూర్తి పదార్థాల కొలతలతో స్టెప్ బై స్టెప్ గైడ్.
పసుపులోని కర్కుమిన్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఎలా ఇస్తాయో తెలుసుకోండి. జీవక్రియలను మెరుగుపరిచే ఉత్తమ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఆముదం ఆకులతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, గౌట్ సమస్య మరియు గాయాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పూర్వకాలం నాటి ఈ అద్భుతమైన ఆయుర్వేద సహజ చిట్కాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖంపై రోజ్ వాటర్ వాడటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రోజ్ వాటర్ ఎలా ఉపయోగపతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
బెండకాయలు తింటే పిల్లలకు లెక్కలు బాగా వస్తాయనే నమ్మకంలో ఎంత నిజం ఉంది? సైన్స్ మరియు నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం.
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు.
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.