లోకేష్ కు బోత్స ఆత్మీయ పలకరింపు .. ఏం జరుగుతోంది!?

Publish Date:Jan 26, 2026

Advertisement

వైసీపీ ఎకోసిస్టమ్ లో కొద్దో గొప్పో మర్యాదా మన్నన తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే మొదట వినిపించే పేరు బొత్స సత్యనారాయణ.  రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తారు.  శాసనమండలిలో ఇటీవల బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్ ను పలకరించి, ఆయనతో సంభాషించారు. వారిరువురి మధ్యా కొద్ది సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టించింది. బొత్స జనసేన గూటికి చేరుతారా? అన్న చర్చ కూడా జరిగింది. అయితే రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అన్నట్లుగా బొత్స తన తీరుతో చాటారు. 

ఇక తాజాగా బొత్స ఏపీ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కొద్ది సేపు సంభాషించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన బొత్స సత్యనారాయణ స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేసి కొద్ది సేపు సంభాషించారు.  రాజకీయ విభేదాలకు అతీతంగా సంబంధాలు కొనసాగించే విషయంలో ముందుగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు చెబుతారు. ఇప్పుడు ఆ ఒరవడిని ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా కొనసాగిస్తున్నారు. బొత్స సత్యనారాయణది కూడా అటువంటి వైఖరే అయినప్పటికీ, వైసీపీ నాయకుడిగా ఆయన చాలా కాలం పొలిటికల్ రైవలరీ అంటే పర్సనల్ రైవలరీయే అన్నట్లుగా వ్యవహరించారు.

అయితే ఇటీవలి కాలంలో ఆయన తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆయన స్వయంగా నారా లోకేష్ వద్దకు వెళ్లి పలకరించి, ఆత్మీయంగా సంభాషించడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. బొత్స సత్యనారాయణ తీరు పట్ల వైసీపీ అధినేత జగన్ ఒకింత గుర్రుగా ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.

 ఇక రాజకీయవర్గాలలో సైతం బొత్స సత్యనారాయణ  వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద లోకేష్ తో బొత్స భేటీ పరిణామాలు వైసీపీలో ఏ విధంగా ఉంటాయన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదని అంటున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు బొత్స లోకేష్ తో ఆత్మీయంగా సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.