Publish Date:Jan 26, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆప్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరయ్యారు. అమెరికాలో తీవ్ర శీతాకాల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లను లెక్కచేయకుండా ఆయన తరగతులకు హాజరై శిక్షణ తీసుకుంటున్నారు. ఓరియంటేషన్ సెషన్‌తో పాటు వివిధ దేశా లకు చెందిన ప్రతినిధులతో కోహార్ట్ పరిచయ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిపాలన, విధాన నిర్ణయాలు, నాయకత్వ రంగాల్లో అనుభవం కలిగిన వారితో కలిసి ఈ శిక్షణలో రేవంత్ భాగ స్వామి కావడం ప్రత్యేకతగా నిలిచింది.
లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరుతో నిర్వహి స్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో తొలి రోజు అనలైజింగ్ అథారిటీ అండ్ లీడర్‌షిప్ అనే అంశంపై చర్చ జరిగింది. ఆధునిక పాలన లో అధికార వినియోగం, ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ సవాళ్లపై నిపుణులు క్లాస్ తీసుకున్నారు. ఒక రెండో రెజైన సోమవారం ( జనవరి 26) కేస్ స్టడీస్‌పై లోతైన విశ్లేషణ, చిన్న గ్రూపులుగా విభజించి నిర్వహించిన కన్సల్టేటివ్ వర్క్ సెషన్లలో సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా పాల్గొ న్నారు. గవర్నెన్స్, పాలసీ అమలు, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలపై అనుభవాలను పంచుకుంటూ శిక్షణ తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బోస్టన్, కేంబ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు తీవ్ర మంచు తుఫాన్ ప్రభావంతో అతలాకు తలమయ్యాయి.
భారీ మంచు తుఫాన్ కారణంగా రెండు అడుగు లకుపైగా మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో అక్కడి అధికారులు వింటర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. రహదారులు మంచుతో కప్పుకుపోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య కూడా రేవంత్ రెడ్డి శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ పాఠాలను తెలుసుకుని, వాటిని తెలంగాణ పాలనలో అమలు చేయా లనే దృక్పథంతో ఈ శిక్షణలో ఆయన పాల్గొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stufent-revanth-reddy-25-213038.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.