మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పీఏసీ జూమ్ మీటింగ్‍లో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని అభ్యర్ధుల గెలుపు బాధ్యతను తీసుకోవాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు లోకల్ మేనిఫెస్టోనూ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నారు.  బీసీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తెలిపారు.  అభ్యర్థులకు బి-ఫామ్‍లు అందజేసే బాధ్యత డీసీసీ అధ్యక్షులు తీసుకోవాలని సీఎం తెలిపారు.  పార్టీ గుర్తులపై ఈ ఎన్నిలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క నాయకుడు  ఛాలెంజ్‌గా తీసుకోని గెలుపు కృషి చేయాలని సూచించారు.  
  ఏపీలో లా& ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజా ఘటనలపై టీడీపీ  సీనియర్ నేతలు, మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావుతో ముఖ్యమంత్రి  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో దొరకిపోయిన వైసీపీ.. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందని.. అందుకే ఆ పార్టీ నేతలు బూతు పురాణం ఎంచుకున్నారని ముఖ్యమంత్రి  తెలిపారు. టీడీపీని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దని చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని..కూటమి ప్రభుత్వం 20 నెలలుగా పాలనలో అభివృద్ధి జరుగుతోందని.. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రులతో సీఎం అన్నారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనపై అప్రమత్తంగా ఉండాలని. వైసీపీ ఇలా చేయడం వల్లే 2024లో ప్రజలు వారికి అధికారం లేకుండా ఆయన చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.
ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిపై నెటిజనులు ఉత్తర కుమారుడు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన చంద్రబాబుపై లేఖాస్త్రాలు సంధించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇటీవలి కాలంలో అంటే గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలై.. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన దాదాపుగా సైలంట్ అయిపోయారు. అంతకు ముందు అంటే ఎన్నికలకు ముందే..  పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అది పక్కన పెడితే... అంతకు ముందు అంటే  2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్నినడిపారు.  ఆ ఉద్యమం పూర్తిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పటి విపక్ష నేత జగన్ కు అనుకూలం అని అప్పట్లో  రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.   2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఆపేశారు.  అంతే కాకుండా జగన్ సర్కార్ కు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కారణంగా  ఆయన కాపు సామాజికవర్గానికి దూరం అయ్యారు. సరే ఆ ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనంతో వైసీపీ  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఆ తరువాత నుంచీ దాదాపుగా సైలంట్ అయిపోయిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు తాజాగా తన పెన్ను విదిల్చారు.   మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు జరిగడంతో ఇప్పుడు మళ్లీ ఆయన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం వ్యతిరేకం అంటూ గొంతు సవరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు.  రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరుగుతోందంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.  కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో పంపించేయడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ఆ లేఖలో చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించారు. అయితే ఈ లేఖపై నెటిజనులు ముద్రగడను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కు కాపుసామాజిక వర్గం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుఓడిస్తానని శపథం చేసినప్పుడు, వైసీపీ అధినేత సహా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయినా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రతినిథిగా చెప్పుకునే నైతికత ఎక్కడిదని విమర్శిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi delivered his career biggest hit with Mana Shankara Vara Prasad Garu, in the direction of Anil Ravipudi, for Sankranti. Prior to the movie, the legendary star completed Pan-India film, Vishwambhara and it had been planned for Summer 2025 release. But VFX work delayed the release of the film.  At the Couple Friendly event, UV Creations representative talked to press and stated that they have been working on their films regularly. He stated that they wanted to release Couple Friendly, last October, but re-worked on quality and are now, bringing it for Valentine's Day weekend.  He addressed Vishwambhara release delay issue and stated that people know how the VFX had been trolled for underwhelming output during the first teaser release. Hence, they are re-working on it and soon, they will announce the release date. He confirmed that they want to release the film as soon as they can but quality will be a non-negotiable priority.  Further, he also expressed confidence on Vishwambhara being a visual feast featuring Chiranjeevi in never-seen-before avatar. Vassishta Mallidi is directing the film with Trisha Krishnan in leading role and Ashika Ranganath in another prominent role.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The excitement surrounding Abhishek Nama’s socio-fantasy magnum opus, Nagabandham, has reached a fever pitch as the film nears the finish line. Positioned as one of the most ambitious pan-Indian projects of 2026, the movie explores the deep-rooted myths of India’s ancient Vishnu temples, focusing on the legendary Nagabandham ritual used to safeguard divine treasures. The production has consistently made headlines for its scale, notably for a massive climax sequence filmed at Ramanaidu Studios that reportedly cost a whopping ₹20 crores. Virat Karrna stars as the protagonist, Rudhra, alongside Nabha Natesh, who portrays the graceful character of Parvati. Iswarya Menon also joins the ensemble in a lead role, supported by veteran actors like Jagapathi Babu and Murali Sharma. To maintain the authenticity of the mythical setting, production designer Ashok Kumar erected grand sets, including a circular formation of giant Dasavatharam idols and a replica of the Padmanabhaswamy Temple, ensuring the film delivers an unparalleled visual spectacle. In a thrilling update for fans, the makers have officially confirmed that the film’s teaser will debut on February 15th, coinciding with the auspicious festival of Mahasivaratri. The announcement was accompanied by a powerful poster featuring a majestic cobra coiled protectively around a secret temple vault, hinting at the high-stakes adventure and spiritual mystery that awaits. Produced by Kishore Annapureddy and Nishitha Nagireddy, Nagabandham is slated for a grand multi-language release this summer. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
2019 ‘ఉరి: The Surgical Strike’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన ఆదిత్యధర్.. మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆరేళ్ల గ్యాప్ తీసుకొని ఇటీవల ‘దురంధర్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్ప్పుడు ‘దురంధర్‌2’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.    2021లో ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో అల్లు అర్జున్‌కి మంచి పేరు వచ్చింది. అంతేకాదు, ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. దాంతో బాలీవుడ్‌కి చెందిన భారీ చిత్ర నిర్మాణ సంస్థలు బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాయి. అందులో భాగంగానే ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నారు. బన్నీకి స్టోరీ కూడా నేరేట్ చేశారని తెలుస్తోంది. అశ్వత్థామ ప్రధాన పాత్రగా రాసుకున్న కథ అది. మొదట విక్కీ కౌశల్‌తో ఆదిత్య ఈ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది.    ఆదిత్య మాత్రం అల్లు అర్జున్‌తో ఆ ప్రాజెక్ట్ చెయ్యాలని ప్రయత్నించారు. బన్నీకి కథ నచ్చి సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే అదే సమయంలో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్ వంటి స్టార్స్‌తో నాగ్ అశ్విన్ ‘కల్కి 2898ఎడి’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. దాంతో అల్లు అర్జున్, ఆదిత్య ధర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకంటే ‘కల్కి’ పురాణాలను ఫ్యూచర్ వరల్డ్‌తో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ సినిమా. అందులో కర్ణుడు, అర్జునుడు, కష్ణుడు వంటి పాత్రలతోపాటు అశ్వత్థామ పాత్ర ప్రధానంగా ఉంటుంది. 2024లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇప్ప్పుడు ‘కల్కి2’ని తెరకెక్కించే పనిలో ఉన్నారు నాగ్ అశ్విన్.    అశ్వత్థామ కథను ‘కల్కి’లో ప్రేక్షకులు చూసేశారు. మళ్ళీ అదే కథతో సినిమా చేయడం కరెక్ట్ కాదని భావించిన ఆదిత్య, బన్నీ ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. తాజాగా ‘దురంధర్‌’ చిత్రం విడుదలైన తర్వాత ఆదిత్య ధర్ తన నెక్స్‌ట్ సినిమాను బన్నీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ‘దురంధర్‌2’ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా, లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. బన్నీ కూడా తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆదిత్య, బన్నీ తమ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత కలిసి సినిమా చేస్తారేమో చూడాలి. 
    -నిన్నబర్త్ డే వేడుకల్లో ఏం జరిగింది -బ్రహ్మానందం స్పీచ్ లో ఏముంది -సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తున్నారు   నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది. ఐ యాం ఫైర్.. ఇలాంటి ఎన్నో ఊర కామెడీ డైలాగ్స్ కామెడీ కింగ్, మీమ్స్ గాడ్ పద్మశ్రీ బ్రహ్మానందం(Brahmanandam)నుంచి సుదీర్ఘ కాలం నుంచి వస్తు అభిమానులని ప్రేక్షకులకి బాధ కలిగినప్పుడుల్లా టాబ్లెట్స్ జోలికి వెళ్లే అవసరం లేకుండా చేస్తున్నాయి.   నిన్న బ్రహ్మానందం తన 70 వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు కొన్ని ప్రముఖ సంస్థలు ఆయన జన్మదిన వేడుకలని హైదరాబాద్ లో  ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్రహ్మ్మనందం మాట్లాడుతు నాది డెబ్భై వ పుట్టిన రోజు అని ఎవరు చెప్పారో కానీ డెబ్భై అని వేసి పడేసారు. ఏముందిలే అనుకోని నేను కూడా ఒకే అన్నాను. మీరంతా నా వయసు ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదు అని చెప్పుకొచ్చాడు. ఆయన ఆ విధంగా మాట్లాడేటప్పుడు ముఖ కవళికల్లో తేడా కనపడుతుంది. దీంతో కొంత మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు బ్రహ్మ్మనందం ఏజ్ నిజంగా డెబ్భై కాదా, ఇంకా తక్కువనా, ఎక్కువనా అనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం తన దైన ఎంటర్ టైన్ మెంట్ కోణంలో ఆ విధంగా మాట్లాడారనే కామెంట్స్ చేస్తున్నారు. Also read:  మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్  ఏది ఏమైనా బ్రహ్మ్మనందం మాట్లాడిన మాటలు అభిమానులతో పాటు నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. రాజా సాబ్ లో అలరించిన బ్రహ్మనందం మరిన్ని ప్రాజెక్ట్స్ లో చెయ్యాలని  అభిమానులు కోరుతున్నారు.      
Laggam Time is produced by K. Himabindu under the banner of 20th Century Entertainments. It is presented by K. Yashwanth Kumar. Rajesh Meru and Navya Chityala feature as the lead pair. Directed by Prajoth K. Vennam, the movie is set to release on February 6.  Its pre-release event was held today ahead of the movie's theatrical release. Speaking on the occasion, Hero Rajesh Meru said, “Before Laggam Time, all the stories I listened to were violent. But the moment I heard this story, I felt I had to do this film. We worked very hard to make this movie. Thanks to the support given by the media, our film has reached the audience. Our movie will entertain everyone. I request everyone to watch and support our film when it releases on February 6.” Producer K. Himabindu said, "We have produced Laggam Time with a lot of difficulty and at great expense. We hope the audience will watch our movie and tell us honestly whether they liked it or not. However, because of the new trend of re-releases, small producers like me and small films like ours are not getting enough support and traction. When these re-releases are also scheduled for Fridays and weekends, films like ours do not receive proper support. It doesn’t need special mention how crucial weekends are for small films like ours. That’s why everyone should think once about this issue of re-releases. I can confidently guarantee that audiences will walk out of the theatre laughing wholeheartedly after watching Laggam Time.”   Director Prajoth K. Vennam said, “All of us are newcomers, and when a film is made entirely by newcomers, care has to be exercised. We made sure there were no mistakes anywhere. I would like to thank my hero Rajesh, heroine Navya, producer Himabindu, Nellore Sudarshan, and the entire team for supporting me on this journey. Laggam Time will appeal to audiences from all sections and will be appreciated by everyone. Our film is releasing on February 6.” Choreographer Krishna Prasad speaking said, “I thank Rajesh for supporting me in the film Laggam Time. My thanks to the director and producer for giving me this opportunity. Thanks to the heroine as well for supporting me during this journey. This film is releasing on February 6. Please watch it.” Editor Vishwanath Koochanapalli said, “I personally like love stories more, but until now I have worked mostly on horror and thriller films. I am happy to have worked on Laggam Time. I joined this project at the final stage. Thanks to director Prajoth for giving me this opportunity. This film will not feel like a small-budget movie at any point. From beginning to end, it will be an enjoyable film.”   Music director Pawan speaking said, “Laggam Time has good songs. The melodies will appeal to everyone. Thanks to the director and producer for giving me this opportunity. Everyone please watch our movie when it releases on February 6.” Costume designer Reteesha Reddy said, “Looking at the output of Laggam Time, it doesn’t feel small-scale anywhere. I am happy that the outfits are already receiving good appreciation.” Cinematographer Pawan Guntuku said, “Director Prajoth worked very hard. This film will feel large at every point. It will appeal to all sections of the audience. I hope everyone watches and supports this film when it releases on February 6.” Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'జైలర్-2'లో గెస్ట్ రోల్ లో షారుఖ్ ఖాన్! రజినీకాంత్ ఫ్రెండ్ గా బాలీవుడ్ బాద్‌షా! బాలకృష్ణతో అనుకున్న సీక్వెన్స్ నే ఇలా మార్చారా?   సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' మూవీ, వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'జైలర్-2' (Jailer 2) రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తుండటం విశేషం. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ రివీల్ అయ్యాయి.   'జైలర్-2'లో రజినీకాంత్ ఫ్రెండ్ గా షారుఖ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. క్లిష్టమైన పరిస్థితిలో రజినీ మనుషులను రక్షించేందుకు షారుఖ్ ఎంట్రీ ఇస్తాడట. ఈ సీక్వెన్స్ ను నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేసినట్లు సమాచారం.   నిజానికి 'జైలర్'లో గెస్ట్ రోల్స్ కూడా ఇదే తరహాలో ఉంటాయి. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ రోల్ కి థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రజినీ ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ నుంచి రక్షించడానికి శివ రాజ్‌కుమార్ వచ్చే సీన్ అదిరిపోయింది.     'జైలర్-2'లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గెస్ట్ రోల్ చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ ఎందుకనో ఆయన ఆసక్తి చూపలేదు. బాలయ్య గెస్ట్ రోల్ చేస్తే.. శివన్న రోల్ ని మించిన రెస్పాన్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ బాలయ్య నో చెప్పడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది.   అయితే బాలకృష్ణతో అనుకున్న సీక్వెన్స్ నే షారుఖ్ ఖాన్ కోసం సరికొత్తగా మలిచినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. దాదాపు పది నిమిషాల పాటు తెరపై షారుఖ్ సందడి చేయనున్నాడని వినికిడి. మరి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి.   Also Read: విజయ్, రష్మిక పెళ్లి.. అది ఫేక్ న్యూస్!  
  -అల్లు శిరీష్ చెప్తాడా లేక ఎవరు చెప్తారు  -అధికారకంగా ఎప్పుడు ప్రకటిస్తారు చెప్పండి -అసలేం జరుగుతుంది. ఫ్యాన్స్ ఏమంటారో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)సోదరుడిగా సెల్యులాయిడ్ పై కాలు మోపిన అల్లు శిరీష్(Allu Sirish)సినీ అనుభవం పన్నెండు సంవత్సరాలు. అంత లాంగ్ జర్నీ ని అనుభవంగా ఉంచుకొని ఇప్పటి వరకు ఏడూ సినిమాలు మాత్రమే చేసాడు. తన కట్ అవుట్, బడ్జెట్ కి తగ్గట్టుగా సరైన కథ కుదిరితేనే చేస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 2024 లో చేసిన 'బడ్డీ'   తర్వాత మళ్ళీ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వలేదు. రీసెంట్ గా తన కొత్త చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి 'టేక్ ఆఫ్' అనేదే లేకుండా ఒక రేంజ్ లోనే  చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో  చూసేద్దాం.   అల్లు శిరీష్ తన నెక్స్ట్ మూవీ సోలో బతుకే సో బెటర్, బచ్చలమల్లి చిత్రాల ఫేమ్ సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi)దర్శకత్వంలో చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సదరు చిత్రానికి 'మగజాతి ఆణిముత్యం 'అనే టైటిల్ ఫిక్స్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ నే వైరల్ గా మారింది.సదరు మగ జాతి ఆణిమత్యం టైటిల్ సోషల్ మీడియాలో 24 అవర్స్  ఆన్ డ్యూటీ అంటు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే  అనేక ట్రోల్ల్స్ కి పేటెంట్ వర్డ్. దీంతో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులకి మరింత దగ్గర కావడంతో పాటు కథ, కథనాలు కుదిరితే సినిమా భారీ హిట్ అవ్వడం ఖాయమనే మాటలు అభిమానుల నుంచి వినపడుతున్నాయి. అల్లు శిరీష్ ఫస్ట్ టైం రగ్గడ్ టైటిల్ తో చేస్తున్న మూవీ కూడా ఇదే. Also read:  అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది.. తలెత్తుకోలేని పరిస్థితి కాకపోతే 'మగజాతి ఆణిముత్యం'(Magajathi Aanimuthyam)టైటిల్ తో పాటు సినిమా ఉన్నట్టుగా అధికార ప్రకటన అయితే రావాలి. హాస్య క్రి యేషన్స్ పై రాజేష్ దండా నిర్మించబోతున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ మార్చి 6 న నయనక రెడ్డి ని వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో వివాహం తర్వాత సదరు 'మగజాతి ఆణిముత్యం' ప్రకటన వస్తుందా లేక పెళ్ళికి ముందే ప్రకటన చేసి పెళ్లి అయ్యాక షూటింగ్ లో పాల్గొంటాడా అనేది చూడాలి.     
Allu Arjun and Ram Charan have been very close friends but recent events seem to have developed a wedge between them. In fact, Allu Arjun's opposition to Pawan Kalyan seemed to have upset not just fans but entire family. Now, Arjun took to X to wish his brother-in-law but he did mention about Chiranjeevi more.  Allu Arjun extended his heartfelt sentiments on X, stating, "Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again." His message beautifully captured the collective mood of the Mega and Allu families, noting that there is "Immense joy and celebration all around" following this wonderful news. The actor further highlighted the emotional significance of the occasion for the legendary Chiranjeevi and his grandkids, mentioning that "The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well." It is truly a special moment for fans to witness the bond between these iconic families as they welcome the newest members.    Allu Arjun expressed that he was "So happy to see them and the entire family’s smiling faces." In a touching conclusion, he noted how "The little ones have brought in so much delight to the world with their entry," wishing them "Double the love, double the joy, for a beautiful new beginning." For those uninitiated, Ram Charan and Upasana have become parents of twins - a baby girl and a baby boy, on 31st January late night. They have become parents of three kids with the new arrivals. Megastar Chiranjeevi shared the news to world and seen very happy about it. So, Allu Arjun highlighted more about Chiru than family.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  వైరల్ గా మారిన విజయ్, రష్మిక పెళ్లి న్యూస్! సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్!   కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజే(ఫిబ్రవరి 2) వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్తల్లో నిజంలేదు.   కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అంతవరకు నిజమే. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక పెళ్లి డేట్ గురించి రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. నేడే పెళ్లి అంటూ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. (Vijay Rashmika Wedding)   నిజానికి విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుందట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కి అందరినీ పిలవనున్నారని తెలుస్తోంది.   2018లో విడుదలైన 'గీత గోవిందం', 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ కలిసి ఫెస్టివల్స్ జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.   కాగా, విజయ్-రష్మిక వివాహం ఫిబ్రవరి 26న జరగనుందని గత డిసెంబర్ లోనే 'తెలుగువన్' చెప్పడం విశేషం. Also Read: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్!  
నాని, సుజిత్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే సాహో, ఓజీ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన సుజిత్.. ఈసారి నాని కోసం ఓపవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని రెడీ చేశారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త లుక్‌లో ఈ సినిమాలో నాని కనిపించబోతున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమా నానికి ఒక కొత్త ఇమేజ్‌ని తెస్తుందని అందరూ భావిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్‌డేట్ అందర్నీ షాకింగ్‌కి గురి చేస్తోంది. ఇప్పటి వరకు టాప్ హీరోలతో జోడీ కట్టిన పూజా హెగ్డే ఈ సినిమాలో నాని సరసన నటించబోతోందని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్‌గా ఇది హిట్ పెయిర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక మేకింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్ట్ విషయంలో సుజిత్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
విజయం ప్రతి మనిషి జీవితంలో ఒక కలలా ఉంటుంది. దాన్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు.  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.. ఏదో ఒక విషయంలో విజయం సాధించాలని శ్రమిస్తూ  ఉంటారు.  అయితే.. కొందరు లక్ష్యాన్ని సాధిస్తారు,  మరికొందరు  విఫలం అవుతారు. నేను చాలా కష్టపడ్డాను, కానీ విజయం సాధించలేకపోయాను అని కొందరు అంటూ ఉంటారు.  అయితే విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు.. దానికి మరికొన్ని కూడా తోడవ్వాలి. చాలామంది కష్టపడి, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ విజయం కోసం కష్టంతో పాటు మరికొన్ని చాలా ముఖ్యం.  అవేంటో తెలుసుకుంటే.. ఈసారి విజయం అంతు చూడొచ్చు.. తప్పు.. విజయం సాధించడానికి కష్టపడటం మంచి లక్షణమే అయినా,  కొందరు పైకి కష్టపడుతూ మరొకవైపు విజయం కోసం తప్పు చేస్తారు, అబద్దాలు చెప్తారు. అబద్దాన్ని ఆశ్రయించి విజయం సాధించాలని అనుకోవడం చాలా తప్పు.  అబద్దం వల్ల అప్పటికప్పుడు విజయం లభిస్తుందేమో కానీ.. దాని ప్రబావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సరైన దారిలోనే విజయం కోసం ప్రయత్నించాలి. అహంకారం.. జీవితంలో ఏం సాధించినా,  ఎంత తెలివైన వ్యక్తి అయినా ఎప్పుడూ గర్వపడకూడదు.  అది ఒక వ్యక్తిని విజయవంతమైన వ్యక్తి అనే స్థాయి నుండి లాగి పడేస్తుంది.  ఎంత తెలివైన వ్యక్తికి అయినా ఫెయిల్యూర్ రుచి చూపించేది అహంకారమే.. అందుకే ఎట్టి పరిస్థితులలో ఎంత తెలిసినా,  ఎంత ఎదిగినా అహంకారం చూపించకూడదు. సోమరితనం.. విజయానికి అతిపెద్ద శత్రువు సోమరితనం. సోమరితనం ఉన్న వ్యక్తి విజయం వైపు  చురుగ్గా వెళ్లలేడు.  ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా,  ఎన్ని అవకాశాలు ఉన్నా.. అవి ఎక్కడికి పోవులే అనే నిర్లక్ష్యంతో ఉంటారు సోమరిపోతులు. అంతేకాదు.. సోమరిపోతులు ఏ పనిని మొదలు పెట్టినా దానిని సరిగా పూర్తీ చేయలేరు.  ఫలితంగా ఎప్పటికీ ఫెయిల్యూర్ సర్కిల్ లోనే ఉండిపోతారు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం,  ఆరోగ్యకరమైన జీవనశైలి, అన్నింటికంటే ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి.  క్రమశిక్షణ ఉన్నప్పుడు జీవితంలో అన్ని ఒక ప్రణాళికలో జరిగిపోతూ విజయానికి దగ్గర చేస్తాయి. కోపం.. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎప్పుడో చెప్పారు.  కోపంగా ఉన్నవారు.. వారు చేసే ప్రయత్నాలలో విఫలం అవుతూ ఉంటారు.  వారి కోపమే వారిని దెబ్బతీస్తూ ఉంటుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి.  ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మనిషి జీవితంలో తన సామర్థ్యాన్ని సరైన విధంగా వినియోగించుకోగలడు. అందుకే కోపాన్ని దూరంగా ఉంచాలి, కోపం వచ్చినప్పుడు నా శత్రువు దగ్గరకు వచ్చింది దానికి దూరంగా ఉండాలి అనుకోవాలి.  ఇది మనిషిని ప్రశాంత జీవనం వైపు నడిపిస్తుంది. దైవం.. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ప్రశాంతత లభించేది దైవ ఆరాధన వల్లే.. జీవితంలో విజయం సాధించాలంటే  సరస్వతి దేవి కృప,  వినాయకుడి అనుగ్రహం ఉండాలి.  వీరిద్దరి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి అయినా తెలివిగా అధిగమించగలరు.   ప్రతిరోజూ సరస్వతి,  గణేషుడి ఆరాధన,   కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని అధిగమించవచ్చు.                                *రూపశ్రీ.
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం,  ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు.  అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మూత్రం లీకేజి ఇందుకే.. వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం,  పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్  బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు   వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మరో కారణం  ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా,  వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి,  మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి.. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.  పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు,  కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి.  ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా  కెగెల్ వ్యాయామాలు చేయాలి.  సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.   ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.
అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది.  అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు  అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి?  తెలుసుకుంటే.. మూత్రపిండాల వైఫల్యం.. నురుగుతో కూడిన మూత్రం   మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం  బలంగా ప్రవాహించడం వల్ల  తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా  పరిగణించాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు,  ముఖం వాపు, అలసట,  బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం  లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం.  శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు.. నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.  అధిక నురుగు మధుమేహం,  అధిక రక్తపోటును  సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి,  మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి. తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన,  మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...