Publish Date:Feb 27, 2026
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనీ, దీంతో ఆయనను హుటాహుటిన రాత్రికి రాత్రే హైదరాబాద్ కు తరలించారు.
ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ప్రమాదమేమీ లేదనీ వైద్యులు తెలిపారు. కాగా బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వార్త తెలియగానే వైసీపీ శ్రేణులలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.
పలువురు నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-brain-stroke-36-214743.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.