Publish Date:Feb 18, 2026
కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు కూడా
తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం పెను సంచలనం సృష్టించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు కోర్టులకు ఏకకాలంలో బాంబు బెదరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు సహా కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు చేపట్టారు. కోర్టులో విధుల్లో ఉన్న సిబ్బంది, న్యాయవాదులు, కేసుల విచారణ కోసం వచ్చిన ప్రజలను బయటకు పంపించి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కోర్టు భవనంలోని ప్రతి అంతస్తు, గదులు, కారిడార్లు, పార్కింగ్ ప్రదేశాలను క్షుణ్ణంగా సోదా చేశారు. కోర్టు పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించి ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. కోర్టులో కేసుల విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా కరీంనగర్ జిల్లా కోర్టుకు కూడా ఇలాగే బాంబు బెదరింపు ఈ మెయిల్ రావడంతో అక్కడ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం జిల్లా జైలుకూ కూడా ఇదే విధంగా బాంబు బెదరింపు ఈ మెయిల్ వచ్చింది. అక్కడ కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇలా ఉండగా ఈ బెదరింపు మెయిల్స్ వెనుక ఎవరున్నారన్న వివరాలు తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దింగారు. మెయిల్ పంపిన సర్వర్, ఐపీ అడ్రస్, ఉపయోగించిన నెట్‌వర్క్ వివరాలను సేకరిస్తున్నారు. ఒకేసారి పలు కోర్టులకు బెదిరింపులు రావడంతో దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? అకతాయిల పనేనా అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ఇటీవలి కాలంలో కోర్టులను లక్ష్యంగా చేసుకుని తరచూ బెదిరింపులు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bomb-threat-to-nampally-cbi-court-36-214283.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.