పాట జీవితం అయిన వేళ

Publish Date:Jul 19, 2021

Advertisement

విజయవాడ, ఆటోనగర్ నుంచి ఎన్టిఆర్ సర్కిల్ కి వెళ్లే పంటకాలువ రోడ్ అది. లైఫ్ స్టైల్ సంబంధించి ఎదో కంటెంట్ రాయడానికి ఆలోచిస్తూ బుర్రకి ఏదీ గోచరించక పరధ్యానంగా ఇంటికి వెళ్తున్నా. వర్షం వచ్చేలా ఉందని ఎక్సలేటర్ కొంచెం రేజ్ చేసాను.  నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి  "హా.... నా గొంతు శృతిలోనా" అని ఒక రాగం శ్రావ్యంగా వినిపించింది.పాట కచేరీ ఎదో జరుగుతుందని అనుకున్నాను. ఇద్దరు అందకళాకారుల తమకి సహాయం చేయమని ఊరికే డబ్బులు అర్ధించకుండా వెచ్చని సాయంత్రాన్ని వింజామారాలతో చల్లార్చినట్లు మధురమైన గానంతో మత్తెక్కిస్తున్నారు. కాసేపు నిలబడి చూసాను. "పాట జీవితాన్ని అభిషేకిస్తున్నట్లు సుందర దృశ్యం కనిపించింది" నేను తీసిన చిత్రాలకి అపుడు విన్న పాటనే అతికించాను.

*"నా గొంతు శృతిలోనా.....!
నా గుండె లయలోనా.....!
ఆడవే పాడవే కోయిలా...!"*

*అవును మీ గొంతు శృతి, మీ గుండె లయ- మనసు ద్యుతితో కలిసిన మీ హృదయం నుంచి ఆ రాగం వస్తుంటే జీవితం తేనె కలిసిన లెమన్ టీ ఫ్లేవర్ లా ఫ్రెష్ గా ఉంది. కోయిలే కాదు ప్రాణం లేని రాళ్లు కూడా ఆడతాయి పాడతాయి*

*"ఒక మాట పది మాటలై- అది పాట కావాలని"*
*"ఒక జన్మ పది జన్మలై-అనుబంధం అవ్వాలనీ"*

*మాట మాత్రమే కాదు మీ ఉచ్వాశ నిస్వాస లోంచి కూడా సంగీతమే వస్తుంది.నిలబడి విన్నోడికి అది తెలుస్తుంది. అలా వింటే ఎక్కడరా బాబూ లేనిపోని ఫిలాసఫీ ని నెత్తినేసుకొని అర్జంట్ గా సత్యం తెలుసుకొని సచ్చీలులం అయిపోతే మన ఘనకార్యాలన్నీ ఆగిపోతాయి అని మనిషికి భయం. మారడానికి మనిషి సిద్ధంగా లేడు అనిపిస్తుంది. అంతెందుకు ఈ సోదంతా రాస్తున్న నేను కూడా ఉన్నపలంగా మారిపోలేను. కానీ కొంచెం అయినా మారాలనిపిస్తుంది. ఒక సెకను ఆలోచిస్తే చాలా స్వల్పం అయిన విషయాలకు అశాంతికి తలుపులు తెరిచి ప్రశాంతతకు తాళాలేసుకొని ద్వేషాన్ని మోసే మన అజ్ఞానంలో కొంచెం మార్పు వస్తుందని చిన్న ఆశ*

*ఒక జన్మ కాదు వంద జన్మలైనా సరే మీతోపాటు నా కళ్లు కూడా తీసేసుకొని అనుబంధం పంచుకోవాలని ఉంది.-ఆ కళ్లను సత్యం చూడలేని ఈ ప్రపంచానికి ఇవ్వు అని దేవుణ్ణి కోరాలని ఉంది.*

జీవితం అంటే ఏంటి? అందులో జీవన విధానం అంటే ఏంటి? ఎలా బ్రతకాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సర్వై కావాలి అని తెగ ఆలోచిస్తుంటాము. ఆ విషయం ఎవరైనా చెప్పాలి లేదా ఎక్కడైనా చూసి నేర్చుకోవాలి. ఎవరో చెప్పడం ఎందుకు? ఎక్కడో చదవడం ఎందుకు? చీకటి తప్ప వెలుతురు తెలీని ఆ అందకళాకారులను చూస్తే సరిపోతుంది కదా అనిపించింది. వారితో కలిసి "జీవితం తనని తాను అన్వేషించుకుంటుంది". "తనని తాను శోధించుకుంటుంది". శ్రీ శ్రీ గారు అంటారు "సాయంత్రం ఆరు అవుతుంది. గదిలో ఒక్కడినే ఉన్నాను. చీకటి చినుకుల్లా కురుస్తుంది" అని. కానీ వీళ్లకి చీకటి నిత్యం కుంభవృష్టిలా కురుస్తుంది. దాని వలన భౌతిక ప్రపంచం మాత్రమే చూడలేరు గానీ తమలోకి తాము సందర్శించుకొని అందమైన ప్రపంచానికి తారల్ని తగిలిస్తూ నిత్యం దేదీప్యమానంగా వెలుగుతుంటారు.  వారినీ, వారి పాటని,మాటని పది నిమిషాలు కదలకుండా వింటే ఈ ఉరుకులు, పరుగులు, అధికారం, హోదా, కష్టం, సుఖం, బాధా, బందీ,ఆధిపత్య,అహం, అహంకారం, పగలు, ప్రతీకరాలు,కక్ష్యలు, కార్పణ్యాలు, పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ అంతా నాన్సెన్స్ లా అనిపిస్తుంది. ఇంత conflict లోంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా! వాళ్ళని చూస్తే అరే ఇంత మధురమైన, అందమైన, శ్రావ్యమైన, రాగవంతమైన, మనో వికాస ప్రకాశిక జీవితం ఇంత తేలికా? అనిపిస్తుంది.ఒక యూనిట్ జ్ఞానోదయం అయినా కలిగిస్తుంది. ఎందుకంటే పాట అక్కడ జీవితాన్ని అభిషేకిస్తుంది.

◆వెంకటేష్ పువ్వాడ

 


 

By
en-us Political News

  
విటమిన్ B12 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయా? ఈ పోషక లోపం లక్షణాలు, కారణాలు మరియు తీసుకోవాల్సిన ఆహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే 5 సులువైన ఇంటి చిట్కాలు మరియు జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, బరువు తగ్గడానికి దీన్ని ఎలా త్రాగాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
బాదం, పిస్తా కంటే తక్కువ ధరలో లభించే వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు నియంత్రణ మరియు పోషక వివరాల పూర్తి సమాచారం.
చెవి నొప్పి మరియు గ్రేడ్ 2 టింపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణుల సలహాలు, షడ్బిందు తైలం నస్య కర్మ, గృహ చికిత్సలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఉడికించిన గుడ్లు వర్సెస్ ఫ్రైడ్ ఎగ్స్.. ఏ పద్ధతిలో వండుకుంటే శరీరానికి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? బరువు తగ్గడానికి ఏది మంచిది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూరప్‌లో ఒక చిన్నారి నేర్పిన జీవిత పాఠం! గెలుపుతో పాటు ఓటమిని, వద్దు అనే తిరస్కారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన స్ఫూర్తిదాయక వెబ్ స్టోరీ కథనం.
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.