బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Publish Date:Mar 3, 2026

Advertisement

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రధాన మంత్రి పదవి వారసత్వ హక్కు కాదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..కాంగ్రెస్ యాక్టింగ్ కోర్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేసినప్పుడు  రాహుల్ గాంధీ  ప్రధానమంత్రి కావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం దేశానికి “గ్రహణం” లాంటిదని సంజయ్ వ్యాఖ్యానించారు. “ప్రధానమంత్రి కుర్చీ చిరునవ్వు, తల ఊపంతో బహుమతిగా ఇచ్చే కుటుంబ వారసత్వం కాదు” అని ఆయన అన్నారు.

‘రాహుల్ గ్రహణం’ ఇప్పటికే దేశాన్ని మూడు సార్లు చీకటిలోకి నెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ,  ప్రధానమంత్రి  నరేందర్ మోడీ  నాయకత్వంలో అభివృద్ధి కిరణాలు ఎల్ల ప్పుడూ ప్రకాశిస్తాయని పేర్కొన్నారు. “ఇది ప్రజాస్వామ్యం, నిజాం తరహా దర్బార్ కాదు” అని విమర్శించారు. దేశంలో ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదని, 140 కోట్ల భారతీయులు ఇప్పటికే మూడు సార్లు నరేంద్ర మోదీపై తమ మద్దతు ముద్ర వేశారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఎన్నిక ప్రజల ఓట్ల ద్వారానే జరుగుతుందని, హైదరా బాద్ సభల నినాదాలతో కాదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రజలు ‘హామీలు’ మరియు ‘రాకుమారుడి ఆశయాల’పై విసుగుతో ఉన్నారని  సంజయ్ అన్నారు. తిరస్కరణను ఎదుర్కొన్న నాయకుడిని ఎలాంటి ప్రచారం కప్పిపుచ్చలేదని పేర్కొన్నారు.అలాగే తెలంగాణ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

హైడ్రా చర్యలతో పేదల ఇళ్లు కూల్చివేత....విద్యార్థుల రీయింబర్స్‌మెంట్‌ల నిలుపుదల...రైతు భరోసా హామీల అమలు లోపాలు...

మూసి పునర్నిర్మాణం పేరుతో నిరాశ్రయ సమస్య..

రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల పెండింగ్... వాటి ఈ అంశాలను ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని రేవంత్ రెడ్డికే తెలుసని, కాబట్టి భజన ఆపి పరిపాలనపై దృష్టి సారించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
 

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.