ప్రేమ విఫలమై యువ నర్సు ఆత్మహత్య
Publish Date:Mar 3, 2026
Advertisement
మియాపూర్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమవడంతో యువ నర్సు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మేఘావతు సోను భాయ్ (20) అనే యువతి హైదరాబాద్ నగరానికి వచ్చి మియాపూర్ మక్తలోని ఓ హాస్టల్‌లో ఉంటూ, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు విధులు నిర్వహిస్తోంది. గత సంవత్సరం కాలంగా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఈ ప్రేమ జంట మధ్య విభేదాలు తలెత్తింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోను భాయ్ హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఘటనను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరి కి తరలించారు. ప్రేమ వ్యవహారం కారణం గానే ఈ ఘటన జరిగిందా? లేక ఇతర కారణాలున్నా యా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
http://www.teluguone.com/news/content/young-nurse-commits-suicide-after-failed-love-36-214924.html





