కేటీఆర్ వి రాజరిక, నియంతృత్వ పోకడలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Publish Date:Feb 2, 2026

Advertisement

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మరో సారి, తన సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు లక్ష్యంగా సంచలన విమర్శలు చేశారు. కేటీఆర్ వి రాజరిక, నియంతృత్వ పోకడలంటూ ఫైర్ అయ్యారు. మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి మంచివాడు కాకపోయినా కేసీఆర్ ముఖం చూసి ఓటేయాలంటూ కేటీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ఇది ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు. 

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించిన కవిత.. ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ విమర్శలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత కాలం మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ లు టార్గెట్ గా   అవినీతి ఆరోపణలకే పరిమితమైన కవిత.. ఇప్పుడు తన సోదరుడు కేటీఆర్, తండ్రి కేసీఆర్ లను కూడా వదలకుండా పొలిటికల్ విమర్శలకు దిగడం బీఆర్ఎస్ శ్రేణులను బెంబేలెత్తిస్తున్నది.

కేటీఆర్ వి నియంతృత్వ పోకడలంటూ ఆమె చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కేసీఆర్ ను విచారించడమే తప్పని కేటీఆర్ అనడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఫెయిర్ గా జరగాలన్నారు.   ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా  వెళ్లక తప్పదని కవిత స్పష్టం చేశారు.  

By
en-us Political News

  
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఆపేశారు. అంతే కాకుండా జగన్ సర్కార్ కు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కారణంగా ఆయన కాపు సామాజికవర్గానికి దూరం అయ్యారు.
జోగి రమేష్ అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటంటే.. నారా లోకేష్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసే కారణమంటున్నారు. ఆ కేసులో అనుచిత వ్యాఖ్యలే కాకుండా, జోగి రమేష్ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనీ, శాంతి భద్రతలకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారనీ పోలీసులు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం, వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి వారు ప్రయత్నించారు.
అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి.
అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా స్పందించారు.
అంబటి భాష సరికాదని పేర్కొంది. ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది.
ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.