ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఏపీ ఏడు ఒప్పందాలు!

Publish Date:Feb 20, 2026

Advertisement

ఢిల్లీలోని భారత మండపం వేదికగా ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఏపీ సర్కార్ ఈ ఒప్పందాలు చేసుకుంది.  ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయంటున్నారు.  ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేసేలా ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.  ఆ ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి.

క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంఓయు చేసుకుంది. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేందుకు  ఈ ఎంఒయూ దోహదం చేస్తుంది.  

 అలాగే, క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని  లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఒప్పందం చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం అంగీకరించింది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది.  
 
ఇక ఆంధ్రప్రదేశ్ లో    క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఎన్ఐఈఎల్ఐటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌‌ను అమరావతిలో ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు పమకూరుస్తుంది.  ఇక ఇందుకు అవసరమయ్యే భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఈ ఒప్పందం కుదిరింది.  
 
అదే విధంగా రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం  ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తారు.  
 
ఇక పోతే ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.   ఈ ఒప్పందం మేరకు గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులలో టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు,  ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో  ఈ ఓప్పందం కుదిరింది. 
 
కాగా అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేస్తారు.  ఇక ఏడో ఒప్పందం రాష్ట్రంలో  ఏఐ ట్యూటర్ ఏర్పాటు కోసం  ఐఐటీ మద్రాస్ తో  చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.  

By
en-us Political News

  
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బంతిని ఆపే క్ర‌మంలో 15 ఏళ్ల వైభ‌వ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.