మంటల్లో కాలి దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Publish Date:Apr 27, 2026
Advertisement
మెదక్ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సోమవారం (ఏప్రిల్ 27) తెల్లవారు జామున 44వ జాతీయ జాతీయ రహదారి 44పై మాసాయిపేట వద్ద ఈ ఘటన జరిగింది. కాగా ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రమాదాన్ని గమనించి బస్సులోంచి బయటకు దూకేశారు. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు. మరమ్మతు పూర్తయ్యాక సోమవారం తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్ బస్సును తిరిగి హైదరాబాద్‌కు తీసుకువెడుతుండగా.. మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/private-travel-bus-burnt-to-ashes-in-flames-36-218334.html





