సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్ట్
Publish Date:Feb 20, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును నాంపల్లి కోర్టు మరోసారి తిప్పి పంపించింది.. ఇప్పటికే నాంపల్లి కోర్టు రెండు సార్లు చార్జిషీట్ తిరస్కరించింది. ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన పత్రాల్లో కూడా సాంకేతిక మరియు ఆధారపూరిత మైన లోపాలు ఉన్నట్లుగా స్పష్టం చేసింది. ఈ ఘటన కు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిపై పోలీసులు అభియోగాలు మోపుతూ చార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు. తొక్కిసలా టకు దారి తీసిన పరిస్థి తులు థియేటర్ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం భద్రత ఏర్పాట్లు లోపాలు వంటి ప్రధాన అంశాలను ప్రస్తావించినప్పటికీ కేసును బలపరచడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సరైన విధంగా జత చేయలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూ చార్జిషీట్‌ను రిటర్న్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో నిల్వ చేసిన హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటి కీలక మెటీరియల్‌ను చార్జిషీట్ తో పాటు సమర్పించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా సాక్షాలు లేకపోవడం వల్ల విచారణ ప్రక్రియ ముందుకు సాగడం కష్టమని నాంపల్లి కోర్టు పేర్కొంది... సాంకేతిక లోపాలు, పత్రాల అసంపూర్ణత వంటి అంశాలను సరిచేసి మళ్లీ కోర్టుకు చార్జి షీట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు లోపాలను సవరించిన పోలీ సులు తాజాగా మరోసారి ఛార్జ్ షీటును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఆధారాలను జతపరచి సాంకేతికపరమైన లోపాలు ఏవి లేకుండా సమర్పించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ ప్రారంభం కానుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధితులకు న్యాయం జరిగే దిశగా ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందన్న దానిపై నగరంలో ఆసక్తి నెలకొంది. చార్జిషీట్ పై కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం ఈ కేసులో కీలకంగా మార నుంది.. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కేసులో ఓ తల్లి, కుమారుడులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి రేవతి మృతిచెందగా... కుమారుడు ఇప్పటివరకు పూర్తిగా కోలుకోలేదు.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బాలుడి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sandhya-theater-stampede-case-36-214404.html





