బిగ్ బాస్ బ్యూటీ అన్షురెడ్డిపై చీటింగ్ కేసు
Publish Date:Apr 26, 2026
Advertisement
సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ బ్యూట అషు రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువకుడి నుంచి ఏకంగా 9.35 కోట్ల రూపాయల నగదు, ఆస్తులు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కేవలం అషు రెడ్డిపైనే కాకుండా, ఈ మోసానికి సహకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులపై కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఎనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ధర్మేంద్ర హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో అతడికి అషు రెడ్డితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అషు రెడ్డి నమ్మించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అషు రెడ్డి సోదరి కూడా ధర్మేంద్ర నుంచి సుమారు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. 2018 నుంచి 2025 వరకు వివిధ రూపాల్లో సుమారు 9.35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు, దాదాపు 5 కిలోల బంగారాన్ని అషు రెడ్డికి ఇచ్చినట్లు సత్యనారాయణ ఆరోపించారు. చివరకు పెళ్లి ప్రస్తావన వస్తే సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో తాము మోసపోయామని గ్రహించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించగా, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు అషు రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె బ్యాంక్ లావాదేవీలు, గత కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా దీనిపై అషు రెడ్డి ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.
http://www.teluguone.com/news/content/cheating-case-filed-against-bigg-boss-beauty-anshu-reddy-36-218314.html





