డాలర్ ఆధిపత్యానికి గండి!.. అమెరికా బాండ్లకు తగ్గిన గిరాకీ

Publish Date:Apr 27, 2026

Advertisement

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికా డాలర్ నేడు సందిగ్ధంలో పడింది. గ్లోబల్ మార్కెట్‌లో డీ-డాలరైజేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా చైనా, జపాన్ వంటి అగ్రశ్రేణి దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి క్రమంగా తప్పుకుంటుండటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామంగా కాకుండా..  చాలా కాలంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న  మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం. అమెరికా విధిస్తున్న ఆంక్షల భయం, ఆ దేశ   అప్పుల భారం వంటి కారణాలతో చైనా తన పెట్టుబడులను డాలర్ల నుంచి బంగారంలోకి మార్చుకుంటోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా వద్ద ఉన్న బంగారు నిల్వలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 

మరోవైపు, అమెరికాకు అతిపెద్ద రుణదాతగా ఉన్న జపాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.  అక్కడ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్వదేశీ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఒకప్పుడు జపాన్‌లో వడ్డీ రేట్లు సున్నా శాతం ఉండటంతో, ఇన్వెస్టర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణం తీసుకుని అమెరికాలో పెట్టుబడి పెట్టేవారు దీన్నే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు. కానీ ఇప్పుడు జపాన్ ప్రభుత్వ బాండ్ల   రాబడి పెరుగుతుండటంతో..  తమ దేశంలోనే పెట్టుబడి పెట్టడం వారికి లాభదాయకంగా మారింది.  కరెన్సీ విలువను కాపాడుకోవడానికి జపాన్ తీసుకుంటున్న ఈ చర్యలు అమెరికా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన భారీ బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి నిరంతరం కొత్త బాండ్లను జారీ చేస్తూనే ఉంది. గతంలో వీటిని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్ వంటి దేశాలు పోటీ పడేవి. కానీ ఇప్పుడు ఆ దేశాలు వెనక్కి తగ్గుతుండటంతో..  అమెరికాలోని కొన్ని పెద్ద బ్యాంకులు  ప్రైమరీ డీలర్లుగా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వం తన బ్యాంకులకే వడ్డీ చెల్లిస్తూ ఈ రుణ చక్రాన్ని నడుపుకునే దుస్థితిలో పడింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి తాత్కాలికంగా తోడ్పడినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాంకేతికంగా చూస్తే, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5 శాతం దాటిన ప్రతిసారీ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో  అస్థిరత  పెరుగుతోంది. అధిక వడ్డీ రేట్లు కార్పొరేట్ సంస్థల లాభాలపై ప్రభావం చూపడమే కాకుండా, స్టాక్ వాల్యూయేషన్లను తగ్గిస్తాయి. అగ్రరాజ్యం తన జాతీయ రుణాన్ని 2025 నాటికి 35 ట్రిలియన్ డాలర్లకు పెంచుకుంది. ఈ భారీ అప్పులను ఫైనాన్స్ చేయడం రాబోయే కాలంలో అమెరికాకు పెను సవాలుగా మారనుందనడంలో సందేహం లేదు. 
ఇక డీ-డాలరైజేషన్ అంటే డాలర్ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోతుందని కాదు కానీ బ్రిక్స్  దేశాలు, గల్ఫ్ దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది డాలర్   తిరుగులేని ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించడం మాత్రం తధ్యం. ప్రస్తుతానికి డాలర్ ఇంకా ప్రధాన రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతున్నప్పటికీ..  భవిష్యత్తులో  మాత్రం ఇతర కరెన్సీలు,  బంగారంతో తన స్థానాన్ని డాలర్ పంచుకోక తప్పని పరిస్థితి వస్తుందనడంలో సందేహం లేదు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక చారిత్రాత్మక మార్పు దిశగా పయనిస్తోంది. చైనా, జపాన్ దేశాల చర్యలు డాలర్ వ్యవస్థకు ఒక హెచ్చరిక వంటివి.  అమెరికా తన ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేస్తుంది? తన అప్పుల భారాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే అంశాలపైనే డాలర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భారతీయ పెట్టుబడిదారులు కూడా అంతర్జాతీయ మార్కెట్లలోని ఈ మార్పులను గమనిస్తూ తమ పెట్టుబడి వ్యూహాలను రూపొందించుకునే మార్గంలో అడుగులు వేస్తున్నారు. 

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.